PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrab56fee4-a367-4efb-b93f-ff9a4b5427b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrab56fee4-a367-4efb-b93f-ff9a4b5427b0-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి బలపడే అవకాశాలు లేకపోయినా ఆ పార్టీ మాత్రం కొన్ని విధాలుగా బలపడటానికి మార్గం సుగమం చేసుకుంటున్నది. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడం అదే విధంగా అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా దూకుడు వ్యవహరించడం భారతీయ జనతా పార్టీ చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉdharmapuri aravindh, bjp, ts;kcr;bhavana;bharatiya janata party;telangana;government;media;party;mantraతెరాసను ఇలా టార్గెట్ చేస్తారా...?కేసీఆర్ ఏం చేస్తారు...?తెరాసను ఇలా టార్గెట్ చేస్తారా...?కేసీఆర్ ఏం చేస్తారు...?dharmapuri aravindh, bjp, ts;kcr;bhavana;bharatiya janata party;telangana;government;media;party;mantraThu, 10 Dec 2020 12:45:42 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి బలపడే అవకాశాలు లేకపోయినా ఆ పార్టీ మాత్రం కొన్ని విధాలుగా బలపడటానికి మార్గం సుగమం చేసుకుంటున్నది. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడం అదే విధంగా అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా దూకుడు  వ్యవహరించడం భారతీయ జనతా పార్టీ చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడం ద్వారా లబ్ధి పొందవచ్చు అనే భావన భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. అందుకోసం ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కొన్ని కొన్ని సమాచారాలను కూడా తెప్పించుకుని రెడీగా ఉన్నారని అంటున్నారు. త్వరలోనే వాళ్ళు కొన్ని అవినీతి వ్యవహారాలకు సంబంధించిన విషయాలను బయటపెట్టి మీడియా సమావేశాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఒక బహిరంగ సభను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది.

ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తోంది. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా అవినీతి వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తున్నారు. ఎవరైతే మంత్రులను బీజేపీ టార్గెట్ చేసే అవకాశం ఉందో వారి మీద ఆయన కాస్త ఎక్కువగా ఫోకస్ చేసారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యేల విషయంలో కూడా సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యేల విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం నియోజకవర్గాల్లో పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది.


పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?

నిహారిక వెడ్డింగ్ లో అల్లు అర్జున్ విజిల్ మూమెంట్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు ఐటీ నోటీసులు

టోల్ గేట్ వద్ద చైర్ పర్సన్ హంగామా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>