PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaggareddy4f6f2c0e-1be0-4fce-a288-305b270c4a94-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaggareddy4f6f2c0e-1be0-4fce-a288-305b270c4a94-415x250-IndiaHerald.jpgతెలంగాణ పీసీసీకి కొత్త బాస్ ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీలోని అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్. పీసీసీ రేసులో ఉన్న నేతలు తమ శక్తిని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ రేసులో తాను ఉన్నానని చెబుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్ష ఎంపికకు మూడు సార్లు ఓటమిపాలైన నాయకుల అభిప్రాయాలతో పనిలేదన్నారు సంగారెడ్డి జగ్గారెడ్డి. jaggareddy;auto;kumaar;revanth;sasidhar;apple;uttam kumar reddy nalamada;telangana;congress;రాజీనామా;east;mla;letter;european union;custard apple;sangareddy;jagga reddy;reddy;v;partyతెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయింది! జగ్గారెడ్డి హాట్ కామెంట్స్తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయింది! జగ్గారెడ్డి హాట్ కామెంట్స్jaggareddy;auto;kumaar;revanth;sasidhar;apple;uttam kumar reddy nalamada;telangana;congress;రాజీనామా;east;mla;letter;european union;custard apple;sangareddy;jagga reddy;reddy;v;partyThu, 10 Dec 2020 16:45:25 GMT తెలంగాణ పీసీసీకి కొత్త బాస్ ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీలోని అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్. పీసీసీ రేసులో ఉన్న నేతలు తమ శక్తిని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ రేసులో తాను ఉన్నానని చెబుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.  పీసీసీ అధ్యక్ష ఎంపికకు మూడు సార్లు ఓటమిపాలైన నాయకుల అభిప్రాయాలతో పనిలేదన్నారు సంగారెడ్డి జగ్గారెడ్డి. ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకే తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలన్నారు.  వి.హనుమంతరావు, కోదండరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వనవసరంలేదని అన్నారు జగ్గారెడ్డి. 

                 తాను కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నానని ఆయన వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష పదవిని తనకు ఇవ్వాల్సిందిగా మాణికం ఠాగూర్ ను కోరానని జగ్గారెడ్డి వివరించారు. పీసీసీ చీఫ్ పదవి కోసం తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయినట్టు వస్తున్న వార్తలు నిజమేనని అన్నారు జగ్గారెడ్డి. అయితే పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నా అందరం కలిసే పని చేస్తామని చెప్పారు. హైకమాండ్ ఎవరిని ఎంపిక చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు. కాని పార్టీలో ప్రక్షాళన మాత్రం జరగాలన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్ధవంతంగానే పని చేశారని చెప్పారు. 

                   జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి ఇటీవలే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ముమ్మర కసరత్తులు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ఒక్కొక్క నేతతో విడిగా మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మాణికం ఠాగూర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. గాంధీభవన్ లోనే మకాం వేసిన మాణిక్కం ఠాగూర్ .. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్ష పదవిపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు.



ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!

ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>