PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congres57b95234-45d0-45c0-a777-709720266a3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congres57b95234-45d0-45c0-a777-709720266a3a-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి వెళ్తాను అన్నది అని ఒక సామెత ఉంది. ఇపుడు సీన్ చూస్తే అలాగే తలపిస్తోంది. తెలంగాణాలో ఇన్నాళ్ళూ కాస్తా బలంగా కనిపించిన కాంగ్రెస్ కి దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రెండూ గట్టి దెబ్బ తీశాయి. దీంతో కాంగ్రెస్ పరేషాన్ అయింది. కళ్ళెదుటే తన ఓటు బ్యాంక్ చెదిరిపోతోంది అని కంగారు పడుతోంది. congres;vijayashanti;revanth;hyderabad;congress;bank;janareddy;reddy;v;partyపీసీసీ చీఫ్ కోసం అనుకుంటే సీఎం అభ్యర్ధులు రెడీ ?పీసీసీ చీఫ్ కోసం అనుకుంటే సీఎం అభ్యర్ధులు రెడీ ?congres;vijayashanti;revanth;hyderabad;congress;bank;janareddy;reddy;v;partyThu, 10 Dec 2020 10:30:00 GMTకాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి వెళ్తాను అన్నది అని ఒక సామెత ఉంది. ఇపుడు సీన్ చూస్తే అలాగే తలపిస్తోంది. తెలంగాణాలో ఇన్నాళ్ళూ కాస్తా బలంగా కనిపించిన కాంగ్రెస్ కి దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రెండూ గట్టి దెబ్బ తీశాయి. దీంతో కాంగ్రెస్ పరేషాన్ అయింది. కళ్ళెదుటే  తన ఓటు బ్యాంక్ చెదిరిపోతోంది అని కంగారు పడుతోంది.

దీంతో పాటు పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా అసలు ఏమీ తెలియడంలేదు. సినీ గ్లామర్ తో పాటు రాజకీయంగా అనుభవం కలిగిన విజయశాంతి బీజేపీలోకి చేరిపోవడంతో మరెంతమంది పార్టీ మారుతారో అన్న డౌట్లు వస్తున్నాయి. ఇక సీనియర్ మోస్ట్ నేత జానారెడ్డి పార్టీ మార్పు మీద సంచలన కామెంట్స్ చేశారు.

దాంతో ఖంగు తినడం కాంగ్రెస్ పెద్దల వంతు అవుతోంది. కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ని ఎంపిక చేయాలనుకుంటోంది. దాని కోసం ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ అందరినీ సంప్రదిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో జానారెడ్డి తాను పార్టీ మారడం ఏంటి అన్న మాట వాడారు. అది మంచిదే కానీ అదే సమయంలో ఆయన మరో మాట కూడా వాడారు. తాను సీఎం క్యాండిడేట్ ని అని.  దాంతోనే   కాంగ్రెస్  లో కొత్త చిచ్చు మొదలైంది.

అసలే కాంగ్రెస్ ఇబ్బందులో ఉంది. ముందు పార్టీని కాపాడుకోవాలి. ఆ మీదట ఏమైనా, ఎవరైనా అన్నది కాంగ్రెస్ పెద్దల మాటగా ఉంది. ఇక పీసీసీ చీఫ్ విషయంలోనే అతి పెద్ద పెతలాటకం ఉంది. అది ఎక్కడికీ తెమలడం లేదు. రేవంత్ రెడ్డికి ఇవ్వాలని కొందరు అంటూంటే కాదు  సీనియర్ నేత వి హనుమంతరావు అని అంటున్నారు. మరి కొందరు కాస్తా ముందుకెళ్ళి రెడ్డి సామాజికవర్గానికే తిరిగి ఈ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తకరారు తేలకముందే మరో మూడేళ్ళలో జరిగే ఎన్నికలు, కాంగ్రెస్ గెలిస్తే అయ్యే సీఎం కోసం ఇప్పటి నుంచే పోటీ ఎందుకు అన్నది మాటగా ఉంది. మరి జానారెడ్డి తాను సీఎం క్యాండిడేట్ అని చెప్పుకోవడం వెనక పీసీసీ రేసులో తానూ ఉన్నానని చెప్పడమేనా అన్న చర్చ కూడా సాగుతోందిట.




అపజయం ఎరుగని అగ్ర దర్శకులు

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>