PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijyashathi-fires-on-xm-kcrf2582920-e1f2-4b27-b2cf-c38ca9a70ad9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijyashathi-fires-on-xm-kcrf2582920-e1f2-4b27-b2cf-c38ca9a70ad9-415x250-IndiaHerald.jpg గజ్వేల్, సిద్దిపేటలపై వందల వేల కోట్ల విలువైన వరాలు కురిపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ దొరకు తెలంగాణ అంటే ఈ రెండు ప్రాంతాలు మాత్రమేనా? అని బీజేపీ నేత విజయశాంతి ప్రశ్నించారు. ఈ రెండు ప్రాంతాలు తప్ప మిగిలిన తెలంగాణ అంతా ఆయన దృష్టిలో ప్రాంతేతర పరగణానా? అని మండిపడ్డారు. 100 మందికి పైగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమిటీ ఈ అన్యాయం నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. vijyashanthi;kcr;vijayashanti;ramu;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;district;government;huzur nagar;karimnagarబీజేపీలో చేరాక గేర్ మార్చిన రాములమ్మబీజేపీలో చేరాక గేర్ మార్చిన రాములమ్మvijyashanthi;kcr;vijayashanti;ramu;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;district;government;huzur nagar;karimnagarThu, 10 Dec 2020 22:02:17 GMTబీజేపీ బలం పెరుగుతోంది. అధికార టీఆర్ఎస్ సహా కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలు బీజేపీ వైపు చూస్తోన్నారు. ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠాన్ని అధీష్టించాక రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడిందనే చెప్పొచ్చు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం. అయితే మాజీ ఎంపీ విజయశాంతి కూడా ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.  బీజేపీలో చేరిన అనంతరం విజయశాంతి తన దూకుడు పెంచారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు.

ఇక సీఎం కేసీఆర్ గురువారం సొంత జిల్లా సిద్ధిపేటలో పర్యటించిన నేపథ్యంలో విజయశాంతి మరోసారి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గజ్వేల్, సిద్దిపేటలపై వందల వేల కోట్ల విలువైన వరాలు కురిపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ దొరకు తెలంగాణ అంటే ఈ రెండు ప్రాంతాలు మాత్రమేనా? అని ప్రశ్నించారు. ఈ రెండు ప్రాంతాలు  తప్ప మిగిలిన తెలంగాణ అంతా ఆయన దృష్టిలో ప్రాంతేతర పరగణానా? అని ట్వీట్ చేసారు. 100 మంది వరకూ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమిటీ ఈ అన్యాయం  నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు.

ఇక  గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన విజయశాంతి కేసీఆర్‌ తనకంటే గొప్ప నటుడని ఎద్దేవా చేసారు. తను ఎంపీగా గెలిచినప్పటి నుంచి తనను రాజకీయాలకు దూరం చేయాలని కేసీఆర్‌ కుట్ర పన్నారన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ను ఇన్నాళ్లు ప్రజలు భరించారని.. ఇక భరించే ఓపిక వారికి లేదని, త్వరలోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ కనుమరుగుకానుందని హెచ్చరించారు. ప్రస్తుతం టీ-కాంగ్రెస్‌ లో పదవుల కొట్లాట జరుగుతోందని, ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పారు. కేసీఆర్ పథకం ప్రకారం తన కుటుంబానికి తరతరాలైనా పదవులు వచ్చేలా ప్రణాళికలు చేసుకున్నాడని మండిపడ్డారు





ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>