PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/triple-talaq-case-again-in-hyderabda8c413d8-2246-413f-a0f1-2cff5e8e40fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/triple-talaq-case-again-in-hyderabda8c413d8-2246-413f-a0f1-2cff5e8e40fe-415x250-IndiaHerald.jpgట్రిపుల్ తలాక్ కు ప్రభుత్వం చెక్ చెప్పింది. అయినప్పటికీ మనదేశంలో అడపాదడపా ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ ట్రిపుల్ తలాక్ కేసు బయటపడింది. అమెరికా నుంచి ఫోన్ చేసి.. భార్యకి తలాక్ చెప్పాడు ప్రబుద్ధుడు. ఈ ఘటనపై కేంద్రం జోక్యం చేసుకోవాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తున్నారు. triple talaq case again in hyderabd;women;amala akkineni;ahmed;ali;hyderabad;american samoa;smart phone;police;husband;woman;cheque;local language;central government;triple talaq;manadesam;santoshamమళ్లీ త్రిపుల్ తలాక్ కేసు..!మళ్లీ త్రిపుల్ తలాక్ కేసు..!triple talaq case again in hyderabd;women;amala akkineni;ahmed;ali;hyderabad;american samoa;smart phone;police;husband;woman;cheque;local language;central government;triple talaq;manadesam;santoshamThu, 10 Dec 2020 23:15:00 GMTట్రిపుల్ తలాక్ కు ప్రభుత్వం చెక్ చెప్పింది. అయినప్పటికీ మనదేశంలో అడపాదడపా ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ ట్రిపుల్ తలాక్ కేసు బయటపడింది. అమెరికా నుంచి ఫోన్ చేసి.. భార్యకి తలాక్ చెప్పాడు ప్రబుద్ధుడు. ఈ ఘటనపై కేంద్రం జోక్యం చేసుకోవాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో ఉండే సభా ఫాతిమాకి అమెరికాలో ఉన్న  తన భర్త నుంచి ఫోన్ వచ్చింది. తమ కుటుంబ విషయాలు, మంచీ చెడూ మాట్లాతాడని ఆశించి.. సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసిన బార్య ఫాతిమాకు అటునుంచి వచ్చిన మాటలు విని షాక్ అయింది. భర్త నోటి నుంచి మూడు సార్లు వచ్చిన తలాక్ మాటలు విని తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఖండాంతరాల దూరం నుంచి ఫోన్ చేసి..వైవాహిక బంధానికి  శాశ్వత దూరం చేయడాన్ని ఫాతిమా జీర్ణించుకోలేకపోయింది.

భారత ప్రభుత్వం .. ట్రిపుల్ తలాక్ కు గతంలోనే చెక్ పెట్టింది. ఈ మేరకు చట్టం చేసి అమలు చేస్తోంది. అయినప్పటికీ కొందరు దుర్మార్గులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. పాతబస్తీలో ఫాతిమాకు ట్రిపుల్ తలాక్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాకు అమెరికాలో ఉన్న అభీద్ అలీ అహ్మద్ తో  వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు ఇద్దరు కలిసి అమెరికాలోనే ఉన్నారు. అక్కడినుంచి కొద్దినేలల క్రితం సభా ఫాతిమా హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. అయితే  అభీద్ అలీకి ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా నిన్న రాత్రి ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అంతేకాకుండా వాట్స్అప్ ద్వారా కూడా ట్రిపుల్ తలాక్ ను పంపించాడు.

దీంతో షాక్ కు గురైన సభా ఫాతిమా వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు.  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా సభా ఫాతిమా సంప్రదించారు. తనకు అభిద్ అలీ ట్రిపుల్ తలాక్ చెప్పారని చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలని  బాధితురాలు ఫాతిమా డిమాండ్ చేస్తున్నారు.


కలిసి పోటీ...అది సరే అభ్యర్ధి జనసేన నుంచేనా?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>