SpiritualitySS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ttd9efb657f-7d74-40c1-bdd6-0545d6051884-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ttd9efb657f-7d74-40c1-bdd6-0545d6051884-415x250-IndiaHerald.jpgఇటీవలే టీటీడీ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుడికో గోమాత' అనే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... గో సంరక్షణతో దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. గోవుకు పురాణాల్లో విశిష్ట స్థానం ఉందని, గోవును పూజించి రక్షిస్తే అనేక మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించారుttd;amala akkineni;dharma;tiru;hyderabad;bharatiya janata party;vijayawada;andhra pradesh;telangana;yv subbareddy;tirupati;sv museum;capital;chief minister;husband;cow slaughter;central government;reddy;y v subbareddy;tirumala tirupathi devasthanamగో సంరక్షణతో దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే 'గుడికో గోమాత' - టీటీడీ చైర్మన్గో సంరక్షణతో దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే 'గుడికో గోమాత' - టీటీడీ చైర్మన్ttd;amala akkineni;dharma;tiru;hyderabad;bharatiya janata party;vijayawada;andhra pradesh;telangana;yv subbareddy;tirupati;sv museum;capital;chief minister;husband;cow slaughter;central government;reddy;y v subbareddy;tirumala tirupathi devasthanamThu, 10 Dec 2020 21:30:00 GMTకేంద్ర బీజేపీ ప్రభుత్వం 'గో సంరక్షణ చట్టం' చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే టీటీడీ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుడికో గోమాత' అనే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... గో సంరక్షణతో దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. గోవుకు పురాణాల్లో విశిష్ట స్థానం ఉందని, గోవును పూజించి రక్షిస్తే అనేక మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి టీటీడీకి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని ఆయన కోరారు.



హిందూ ధర్మంలో గోమాతకు తల్లి స్థానం ఇచ్చారని అందుకే గోవును గోమాత అంటామని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదంతో గోసంరక్షణ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7 వతేదీ విజయవాడ కనక దుర్గ ఆలయంలో కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. రెండవ విడతగా ఈ రోజు తెలంగాణలో కార్యక్రమం ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో క‌ర్ణాట‌క, తమిళనాడు రాష్ట్రాల్లోని దేవాల‌యాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు. హిందూ ధ‌ర్మప్రచార ప‌రిష‌త్, ఎస్వీ గో సంర‌క్షణ‌శాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమ‌లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం ఎస్వీ గో సంర‌క్షణ‌శాల ద్వారా దేశ‌వాళీ ఆవుల దానాన్ని స్వీక‌రించాల‌ని టీటీడీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. మ‌ఠాలు, పీఠాలు, వంశ‌పారంప‌ర్య ప‌ర్యవేక్షణ ఆల‌యాలు, దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాలు, వేద పాఠ‌శాలల‌కు ఈ కార్యక్రమం ద్వారా టీటీడీ గోవుతో పాటు దూడను అంద‌జేస్తుందన్నారు. గోదానం పొందిన ఆల‌యాలు, పీఠాలు, వేద‌ పాఠ‌శాల‌లు గోవుల సంర‌క్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్వీ గో సంర‌క్షణ‌శాల అనుమ‌తితో భ‌క్తులు ఈ కార్యక్రమానికి గోవుల‌ను దానం చేయాల్సి ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.


కేటీఆర్ మీద ఫిర్యాదు..అంత తేలికగా కనిపిస్తున్నారా ?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>