PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/green-signal-for-non-agricultural-registrationsf8b5d00f-ce80-4bd0-887d-695e2305551a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/green-signal-for-non-agricultural-registrationsf8b5d00f-ce80-4bd0-887d-695e2305551a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి లభించింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ వినతి మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు పలు సూచనలు చేస్తూ అనుమతిచ్చింది. green signal for non agricultural registrations;dharani;high courtవ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ !వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ !green signal for non agricultural registrations;dharani;high courtThu, 10 Dec 2020 22:48:25 GMT
ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు‌పై హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. వ్యవసాయేతర ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తే తమకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ప్రభుత్వాన్ని ధరణి వివరాలు మాత్రమే ఆపాలని సూచించామని తెలిపింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఎటువంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యపై స్పందించిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లను ఆపిందని హైకోర్టుకు తెలిపారు.

ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ముందుగానే స్లాట్ ను బుక్ చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆస్తి పన్ను, గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలనే నిబంధనకు హైకోర్టు అంగీకరించింది.  గతంలో రిజిస్ట్రేషన్ కార్డ్ పద్ధతిలో జరిగాయని పిటిషన్ తరపు లాయర్ తెలిపారు. అదే పద్ధతిలో రిజిస్ట్రేషన్ కొనసాగించాలని కోరారు. రిజిస్ట్రేషన్‌కు ప్రాపర్టీ ట్యాక్స్, గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు ఏజీ. ఆధార్ కార్డు, ధరణిలో ఎంట్రీ వివరాలు అడగొద్దని కోరారు పిటిషనర్ తరపు లాయర్.  నాన్ అగ్రికల్చర్ ఆస్తులను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.  

ధరణి పోర్టల్ పై దాఖలైన పిటిషన్ ను ఈ నెల 8వ తేదీన హైకోర్టు విచారించింది.   దీనికి కొనసాగింపుగా ఇవాళ హైకోర్టు విచారణ చేసింది.  వ్యవసాయేతర  ఆస్తులను పాత పద్దతిలోనే  రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు వెసులుబాటును కల్పించింది. ఈ విషయమై ఎలాంటి స్టే ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ధరణిపై ఇవాళ మరో ఐదు అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. ధరణిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు  ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌  హైకోర్టును గడువు కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.  


టీకా వచ్చిందని రిలాక్స్ అవ్వకండి..మరో ప్రమాదం కూడా ఉంది..

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>