PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/facebook5ec83932-909e-4995-8e2a-4a4a55bd9629-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/facebook5ec83932-909e-4995-8e2a-4a4a55bd9629-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై ముప్పెట దాడి మొదలైంది. సాధారణ పౌరులు, ఉద్యమకారులు కానే కాదు. ఏకంగా అమెరికా ప్రభుత్వమే ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. వాణిజ్య నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా చిన్న చిన్న సంస్థలను నయానో భయానో అణచివేస్తున్నదని అమెరికలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తో పాటు 48 రాష్ట్రాలు ఫేస్ బుక్ పై న్యాయస్థానాల్లో దావాలు వేశాయి. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తో పాటు 48 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ దావా వేయడంతో ఫేస్ బుక్ పరిసfacebook;auto;view;amala akkineni;american samoa;whatsapp;mediaఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడిఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడిfacebook;auto;view;amala akkineni;american samoa;whatsapp;mediaThu, 10 Dec 2020 17:41:49 GMT

  ఫేస్ బుక్ పై అమెరికా ముప్పెట దాడి

ప్రపంచంలో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై ముప్పెట దాడి మొదలైంది. సాధారణ పౌరులు, ఉద్యమకారులు కానే కాదు. ఏకంగా అమెరికా ప్రభుత్వమే ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది.
వాణిజ్య నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా చిన్న చిన్న సంస్థలను నయానో భయానో అణచివేస్తున్నదని అమెరికలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తో పాటు 48 రాష్ట్రాలు ఫేస్ బుక్ పై న్యాయస్థానాల్లో దావాలు వేశాయి. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తో పాటు 48 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ దావా వేయడంతో ఫేస్ బుక్ పరిస్థితి గందరగోళంలోకి నెట్టబడింది. కేసు తీవ్రత అధికంగా ఉన్నందును మున్ముందు ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ లను విక్రయించుకోవాల్సిన దుస్థితి ఉంటుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రపంచంలో తన ఏకఛత్రాధిపత్యానికి ఎదురు లేకుండా ఉండేందుకు ఫేస్ బుక్ దిగ్గజం ఒక వ్యవస్థీకృత వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నది. పలువురు న్యాయ నిపుణులు, టెకీ కంపెనీలు సైతం ఆరోపిస్తున్నాయి కూడా. మొగ్గ తొడుగుతున్న చిన్న చిన్న కంపెనీలను చిదిమేయడం లేకా దారిలోకి తెచ్చుకోవడం చేస్తున్నది. పెద్ద ఎత్తున డబ్బులు ఎరవేసి స్వాధీనపర్చుకొంటున్నదంటూ పలువురు గగ్గోలు పెడుతున్నా పెద్దగా స్పందన రాలేదు. అయితే ఇటీవలి కాలంలో ఫేస్ బుక్ అనైతిక కార్యకలాపాలపై అమెరికా ప్రభుత్వాలు దృష్టి సారించాయి

2012లో ప్రత్యర్థిగా మారిన ఇన్ స్టాగ్రామ్, 2014 లో వాట్సప్ మెస్సేజింగ్ యాప్ ను డబ్బులు ఎరవేసి కొనుగోలు చేసిందని అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆరోపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ ను ఒక బిలియన్ డాలర్లకు, 19 బిలియన్ డాలర్లను వాట్సప్ ను కొనుగోలు చేసిందని అంటున్నారు. ఫేస్ బుక్ వ్యవహారశైలి, కంపెనీ తీరు పోటీ తత్వానికి ప్రమాదకరమని, దీని వల్ల వినియోగదారులకు ఎంపిక అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఫెడరల్ కమిషన్ స్పష్టం చేసింది. గత 15 సంవత్సరాలుగా ఫేస్ బుక్ తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు చిన్న చిన్న సంస్థలను చిదిమేస్తున్నదని ఆరోపించింది. ఇలాంటి విధానాలను పాటించకుండా కఠిన ఆంక్షలు విధించాలని, పోటీని పునరుద్ధరించాలని కమిషన్ తన పిటీషన్ లో న్యాయస్థానాన్ని కోరింది.

అమెరికా ప్రభుత్వ ఆరోపణలను ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ న్యూస్టెడ్ తోసిపుచ్చారు. అమెరికా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. అమెరికా వ్యాప్తంగా కంపెనీపై దావాలు వేయడంతో స్టాక్ ఎక్చేంజీల్లో షేర్లు పతనమయ్యాయి


వైసీపీలో ఇద్ద‌రు లేడీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది... జ‌గ‌న్ చాయిస్ ఎవ‌రు..?

ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>