PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/undi-tdp-mla-manthena-ramaraju-try-to-join-in-ysrcpd7f5b4fb-9641-401d-9f16-f12ccff833a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/undi-tdp-mla-manthena-ramaraju-try-to-join-in-ysrcpd7f5b4fb-9641-401d-9f16-f12ccff833a0-415x250-IndiaHerald.jpgకొంతకాలంగా టిడిపి నుంచి వలసలు పెద్దగా కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కొంతకాలం ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున చేరినా, ఆ తరువాత సైలెంట్ అయ్యారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టడంతో కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు.వారంతా వైసీపీలో అధికారికంగా చేరకుండానే మద్దతుదారులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే టిడిపిలో నాయకులు అనే వారు ఉండరు అని, పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని భావించిన బాబు కమిటీల పేరుతో పార్టీలో నాయకులు అందరికీ పదవులు ఇచ్undi mla manthena ramaraju ysrcp jagan tdp;auto;chinna;godavari river;jagan;andhra pradesh;district;mla;minister;letter;tdp;ycp;partyటీడీపీ ఎమ్మెల్యే రాజు గారు వైసీపీ కి జై కొడతారాటీడీపీ ఎమ్మెల్యే రాజు గారు వైసీపీ కి జై కొడతారాundi mla manthena ramaraju ysrcp jagan tdp;auto;chinna;godavari river;jagan;andhra pradesh;district;mla;minister;letter;tdp;ycp;partyThu, 10 Dec 2020 22:00:00 GMTకొంతకాలంగా టిడిపి నుంచి వలసలు పెద్దగా కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కొంతకాలం ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున చేరినా, ఆ తరువాత సైలెంట్ అయ్యారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టడంతో కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు.వారంతా వైసీపీలో అధికారికంగా చేరకుండానే మద్దతుదారులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే టిడిపిలో నాయకులు అనే వారు ఉండరు అని, పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని భావించిన బాబు కమిటీల పేరుతో పార్టీలో నాయకులు అందరికీ పదవులు ఇచ్చారు. అయితే ఇప్పుడు కొంతమంది నాయకులు పక్కచూపులు చూస్తున్నట్టు వ్యవహరిస్తుండడం టిడిపిలో ఆందోళన కలిగిస్తోంది.



 ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి టిడిపి ఎమ్మెల్యే రామరాజు వ్యవహారంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన వ్యవహారం పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడిన రామరాజు ఆ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు.దీంతో ఆయన పార్టీ మారేందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఉండి నియోజకవర్గం లో రామరాజు ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. 



ఎమ్మెల్యేగా మొదటిసారిగా గెలిచిన  తనకు ఎమ్మెల్యే అన్న హోదా తప్ప , తన పెత్తనం ఏమి సాగకపోవడం , కనీసం చిన్నా, చితకా పనులు చేయించుకో లేకపోవడం,పూర్తిగా వైసీపీ నాయకుల హడావుడి నడుస్తుండడం, దీనికితోడు ఉండి వైసీపీ ఇన్ చార్జ్ పీవీ నరసింహరాజు, అలాగే జిల్లాకు చెందిన మంత్రి శ్రీరంగనాథరాజు వంటివారి పెత్తనం నడుస్తుండడం, పార్టీలో మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజు పెత్తనం ఇలా ఎన్నో అంశాలు లెక్కలోకి తీసుకుంటూ ఆయన వైసీపీ కి అనుబంధంగా ఉంటూ, తన హవా నడిచే విధంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు గా వ్యవహరిస్తుండడం తో ఆయన వ్యవహారం పై టిడిపి లో పెద్ద చర్చ జరుగుతోంది.



బీజేపీలో చేరాక గేర్ మార్చిన రాములమ్మ

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>