PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpgదేశంలో వరుసగా మరలా పెట్రోల్, డీజిల్ రేట్లు అడ్డూ అదుపు లేదన్నట్లుగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.90.34గా ఉంది. అతి త్వరలోనే ఇది 100 రూపాయలకు చేరువైనా ఆశ్చర్యం లేదు. ఇంధనం ధరలు అంతకంతకూ పెరుగుతుండటం పట్ల సామాన్యులు మండిపడుతున్నారు. ముడి చమురు ధర రూ.30 ఉండగా.. పెట్రోల్ రేటు 90 రూపాయలు ఎందుకుందని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఆ బాలన్స్ సొమ్మంతా ఎటు వెళ్తోందని నిలదీస్తున్నారు. petrol;narendra modi;congress;rajya sabha;mp;telugu;capital;twitter;petrol;diesel;party;narendra30 రూపాయల పెట్రోల్ 90 రూపాయలకు చేరిందని విమర్శలు!30 రూపాయల పెట్రోల్ 90 రూపాయలకు చేరిందని విమర్శలు!petrol;narendra modi;congress;rajya sabha;mp;telugu;capital;twitter;petrol;diesel;party;narendraWed, 09 Dec 2020 19:00:00 GMTదేశంలో వరుసగా మరలా పెట్రోల్, డీజిల్ రేట్లు అడ్డూ అదుపు లేదన్నట్లుగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.90.34గా ఉంది. అతి త్వరలోనే ఇది 100 రూపాయలకు చేరువైనా ఆశ్చర్యం లేదు. ఇంధనం ధరలు అంతకంతకూ పెరుగుతుండటం పట్ల సామాన్యులు మండిపడుతున్నారు. ముడి చమురు ధర రూ.30 ఉండగా.. పెట్రోల్ రేటు 90 రూపాయలు ఎందుకుందని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఆ బాలన్స్  సొమ్మంతా ఎటు వెళ్తోందని నిలదీస్తున్నారు. పెట్రోలు రేట్ల పెరుగుదలపై నెటిజన్లు కామెంట్లు, మీమ్స్ రూపంలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ యువనేత ఒకరు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దేశంలోని పెట్రోల్‌ బంకుల పేర్లన్నింటినీ ‘మోదీ వసూల్‌ కేంద్రాలు’గా మార్చాలని ఆ పార్టీ నేత శ్రీవాత్సవ అన్నారు. ఓ పెట్రోల్‌ బంక్‌ పేరు మార్చిన ఫొటోను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. దేశంలో పెట్రోల్‌ ధర రూ.90కి చేరిందని.. వాస్తవానికి దాని ధర రూ.30 అని శ్రీవాత్సవ ట్వీట్ చేశారు. లీటర్ పెట్రోలుపై మోదీ రూ.60 టాక్స్ వసూలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. శ్రీవాత్సవ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు జోడిస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధరలు కూడా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారంటూ కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








పెట్రోలు ధరల పెరుగుదలపై కొన్ని మీమ్స్ పొట్ట చెక్కలయ్యేలా ఉన్నాయి. ‘మిత్రో.. కొద్ది రోజుల్లో పెట్రోలు 50 రూపాయలకే దొరుకుతుంది.. అర లీటర్’ అంటూ మోదీ ప్రకటన చేస్తున్నట్లుగా ఉన్న మీమ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెట్రోలు కొనే పరిస్థితి లేక వాహనదారులు గుర్రపు బగ్గీలను ఆశ్రయిస్తున్నట్లుగా మరి కొంత మంది మీమ్స్ షేర్ చేశారు. ఇంధన ధరల పెరుగుదలపై అధికార పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇప్పటికే ఘాటు విమర్శలు చేశారు. లీటర్ పెట్రోల్‌ను ప్రస్తుతం గరిష్టంగా రూ.40కి విక్రయించాలని ఆయన పేర్కొన్నారు. అంతకంటే ఎక్కువ ధరలకు అమ్మితే అది దోపిడీయే అవుతుందని విమర్శించారు. ప్రస్తుతం పెట్రోల్‌ ఎక్స్‌ రిఫైనరీ ధర లీటర్‌కు రూ.30 మాత్రమే ఉందని.. అందువల్ల లీటర్‌కు గరిష్టంగా రూ.40కి విక్రయించాలని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. దేశంలో ప్రస్తుతం ఇంధన ధరలు రెండేళ్ల గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వరుసగా ఏడో రోజు పెట్రోలు ధరలు పెరిగాయి.



" style="height: 370px;">




ధోని, రైనా బాటలో మరో భారత ఆటగాడు

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>