PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-take-a-step-head-to-ysrcp773bfa3f-0b15-4df6-9c6d-b69b3eb0cf91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-take-a-step-head-to-ysrcp773bfa3f-0b15-4df6-9c6d-b69b3eb0cf91-415x250-IndiaHerald.jpgఏపీలో ఏలూరు ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ ఘటనపై ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఈ ఘటన వెనుక కారణాలు ఏంటీ అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు అస్వస్థతపై సర్కారు ఉదాసీనత చూపిస్తుంది అని మండిపడ్డారు. జనసేన డాక్టర్ల పరిశీలనలో వెల్లడైన అంశాలు ఆయన వివరించారు. అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల పాలవుతున్న రోగుల సంఖ్య ఏలూరులో ఇంకా కొనసాగుతూనే ఉంది అని ఆయన అన్నారు. ప్రజలు ఆందోళనతోనే కాలం గడుపుతున్నారు అని వివరించారు. ఏలూరులోని కొన్ని ప్రాంతాలవాసులు వేరే ఊళ్లకpawan kalyan;pawan;kalyan;jagan;janasena;district;chief minister;central government;janasena party;eluru;reddyఏలూరు ఘటన విషయంలో పవన్ సంచలన వ్యాఖ్యలు, ఏలూరు వదిలి వెళ్తున్నారా...?ఏలూరు ఘటన విషయంలో పవన్ సంచలన వ్యాఖ్యలు, ఏలూరు వదిలి వెళ్తున్నారా...?pawan kalyan;pawan;kalyan;jagan;janasena;district;chief minister;central government;janasena party;eluru;reddyWed, 09 Dec 2020 19:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు అస్వస్థతపై సర్కారు ఉదాసీనత చూపిస్తుంది అని మండిపడ్డారు. జనసేన డాక్టర్ల పరిశీలనలో వెల్లడైన అంశాలు ఆయన వివరించారు.  అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల పాలవుతున్న రోగుల సంఖ్య ఏలూరులో ఇంకా కొనసాగుతూనే ఉంది అని ఆయన అన్నారు.

ప్రజలు ఆందోళనతోనే కాలం గడుపుతున్నారు అని వివరించారు.  ఏలూరులోని కొన్ని ప్రాంతాలవాసులు వేరే ఊళ్లకు వెళ్లిపోతున్నారంటే అక్కడి పరిస్థితిని మనం అర్ధం చేసుకోవచ్చు అన్నారు. నిన్న ఏలూరు వెళ్లిన జనసేన డాక్టర్ల అక్కడ వివిధ ప్రాంతాలలో పర్యటించి నాకు నివేదికను అందజేశారు అని ఆయన పేర్కొన్నారు.  చిన్న వసతులను సైతం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోందో అర్ధంకావడం లేదు అని,  చిన్న పిల్లలకు ఐ.సి.యు లేదు అన్నారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయకుండా సాధారణ రోగుల వార్డుల్లోనే చికిత్సలు చేస్తున్నారని చెప్పారు.

 జిల్లా కేంద్రంలో ఉన్న 500 పడకల ఆస్పత్రిలో న్యూరోఫిజీషియన్ లేకపోవడం  బాధాకరం అని ఆయన అన్నారు. వ్యాధికి కలుషిత నీరు కూడా ఒక కారణంగా భావిస్తున్న తరుణంలో బాధిత ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీరును ఎందుకు సరఫరా చేయడం లేదు అని,  ఇటువంటి ప్రశ్నలకు శ్రీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన తరువాత కూడా ఇక్కడ ఎటువంటి అదనపు సదుపాయాలు ఏర్పాటు కాకపోవడం గమనించ తగ్గ విషయం అన్నారు. ఏలూరులో సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. న్యూరో సర్జన్లు నియమించాల్సి ఉన్నా... పంపలేదు అని అన్నారు.


ధోని, రైనా బాటలో మరో భారత ఆటగాడు

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>