PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine647f77f9-0f8e-4a2c-a6c6-761dbc67bad7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine647f77f9-0f8e-4a2c-a6c6-761dbc67bad7-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత కల్లోలం సృష్టించిందో తెలిసిందే. చాలా దేశాలు కరోనా వ్యాక్సీన్ తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు ఈ ప్రయోగాల్లో సక్సెస్ అయ్యాయి కూడా. ఈ క్రమంలోనే త్వరలోనే భారత్ లో కరోనా వ్యాక్సీన్ పంపిణీ చేస్తామని ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత, వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. vaccine;health;kerala;delhi;india;karnataka - bengaluru;maharashtra - mumbai;west bengal - kolkata;narendra modi;prime minister;september;maharashtra;success;central government;coronavirusవ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!vaccine;health;kerala;delhi;india;karnataka - bengaluru;maharashtra - mumbai;west bengal - kolkata;narendra modi;prime minister;september;maharashtra;success;central government;coronavirusWed, 09 Dec 2020 17:00:00 GMTకరోనా వైరస్ ఎంత కల్లోలం సృష్టించిందో తెలిసిందే. చాలా దేశాలు కరోనా వ్యాక్సీన్ తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు ఈ ప్రయోగాల్లో సక్సెస్ అయ్యాయి కూడా. ఈ క్రమంలోనే త్వరలోనే భారత్ లో కరోనా వ్యాక్సీన్  పంపిణీ చేస్తామని ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత, వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కలిసి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ప్రధాని మోదీ ఇప్పటికే పలు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో, శాస్త్రవేత్తలతో మాట్లాడారని కూడా రాజేష్ వెల్లడించారు. భారత్‌లో మొత్తం 6 వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని, వీటిలో కొన్ని వ్యాక్సిన్‌లకు మరో కొద్ది వారాల్లో లైసెన్స్ వచ్చే అవకాశం ఉందని వివరించారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాజేష్ తెలియజేశారు. అయితే.. వ్యాక్సినేషన్ అనేది కేవలం రాష్ట్రాలు, కేంద్రాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని ఆయన అన్నారు.  మొదటగా.. వ్యాక్సిన్‌ను 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించనున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షల కంటే తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కరోనా కేసుల సంఖ్యలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 4 శాతం మాత్రమేనని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా.. సెప్టెంబర్ నెల మధ్య కాలం నుంచి భారత్‌లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని రాజేష్ భూషణ్ వెల్లడించారు. భారత్‌లో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లోనే 54 శాతం కేసులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

వ్యాక్సిన్ అభివృధ్ధికి సంబంధించి కూడా రాజేష్ భూషణ్ శుభవార్త చెప్పారు. మన శాస్త్రవేత్తల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ప్రతీ ఒక్కరికీ దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోందని హామీ ఇచ్చారు.


సెటైర్ : అటా ఇటా ? ఎటూ తేల్చుకోలేక ...

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!

ఈ కారణంతో రజనీ కామెడి అయిపోతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>