PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-changes-his-decision-after-eluru-incident7e0a1dee-b274-4275-a427-b525e8b01470-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-changes-his-decision-after-eluru-incident7e0a1dee-b274-4275-a427-b525e8b01470-415x250-IndiaHerald.jpgఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకూ ఇస్తున్న ప్యాకేజీ అత్యుత్తమం అని వైసీపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే ఏలూరు ఘటనతో సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకున్నారు. అత్యుత్తమ ప్యాకేజీకి కూడా మార్పులు చేర్పులు చేశారు. మూర్ఛ వ్యాధితో బాధపడే రోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు వైద్య, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు. cm jagan;nani;jagan;minister;ycp;arogyasri;eluru;vఏలూరు ఘటనతో తన నిర్ణయం మార్చుకున్న సీఎం జగన్ఏలూరు ఘటనతో తన నిర్ణయం మార్చుకున్న సీఎం జగన్cm jagan;nani;jagan;minister;ycp;arogyasri;eluru;vWed, 09 Dec 2020 08:00:00 GMTవైసీపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే ఏలూరు ఘటనతో సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకున్నారు. అత్యుత్తమ ప్యాకేజీకి కూడా మార్పులు చేర్పులు చేశారు. మూర్ఛ వ్యాధితో బాధపడే రోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు వైద్య, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న వారికి సీఎం జగన్ బాసటగా నిలిచారు. ఏలూరులో బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం చేసిన మార్పుల ప్రకారం.. మూర్చవ్యాధి గ్రస్తులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచారు.
- గతంలో సాధారణ మూర్ఛ వ్యాధిగ్రస్తుడు మూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వ సహాయం అందేది. ఇప్పుడు ఐదు రోజులపాటు వైద్యం పొందినా కూడా ఆ సాయం అందుతూనే ఉంటుంది.
- ఐదు రోజులకు మించి అదనంగా చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు రూ.900, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి రూ.2,000 ప్యాకేజీని కొత్తగా చేర్చారు. నూతన విధానం మేరకు రక్త పరీక్షలకు 23.73 శాతం రేటు పెంచారు.
- మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,000 నుంచి రూ.15,688 వరకు పెంచారు. 8 రకాల రక్త పరీక్షలను కూడా ఈ ప్యాకేజీలో కలిపారు.
- చిన్న పిల్లలకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,262 నుంచి రూ.12,732కు పెంచారు. 6 రకాల రక్త పరీక్షలను ప్యాకేజీలో చేర్చారు.

మూర్ఛ రోగులకోసం ఆరోగ్యశ్రీలో చేపట్టిన మార్పులపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఏలూరు ఘటన జరక్కపోయి ఉంటే ఈ మార్పు జరిగేది కాదు. అయితే ఏలూరులో బాధితుల కష్టాలను స్వయంగా చూసిన సీఎం జగన్ చలించిపోయారు. ఆరోగ్యశ్రీలో మూర్ఛ వ్యాధికోసం అందుతున్న ప్యాకేజీపై ఆయన ఆరా తీశారు. దాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే వైద్య, ఆరోగ్య శాఖ హుటాహుటిన ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులను పెంచి ఇచ్చేలా జీవో జారీ చేసింది. 


ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>