PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan54adfd87-a29a-407d-87a8-25df10b2ca42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan54adfd87-a29a-407d-87a8-25df10b2ca42-415x250-IndiaHerald.jpgగత రెండు మూడు రోజుల నుంచి జగన్ తెలంగాణ లో వైసీపీ పార్టీ పనులు ప్రారంభిస్తారని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఏపీ లో తాను ఎలాగైతే పార్టీ ని నడిపించారో, తెలంగాణ లో అయన చెల్లెలు షర్మిల పార్టీ కి నాయకత్వాన్ని అందిస్తారని కూడా వార్తలు వచ్చాయి.. అయితే తెలంగాణ లో ని ప్రతిపక్షాలు దీన్ని ఎలా అర్థం చేసుకున్నాయంటే.. వైసీపీ తెలంగాణ కి రావడం చూస్తుంటే కేసీఆర్ కుట్రలో భాగమే అన్నారు.. ఇక్కడి ఓట్లను చీల్చడమే లక్ష్యంగా కేసీఆర్ పథకం వేశారని అన్నారు.. jagan;kcr;bharatiya janata party;india;jagan;andhra pradesh;telangana;parliment;central government;ycp;partyతెలంగాణాలో జగన్ అడుగుపెడితే బీజేపీ కి ఎందుకు కోపం..?తెలంగాణాలో జగన్ అడుగుపెడితే బీజేపీ కి ఎందుకు కోపం..?jagan;kcr;bharatiya janata party;india;jagan;andhra pradesh;telangana;parliment;central government;ycp;partyWed, 09 Dec 2020 19:00:00 GMTజగన్ తెలంగాణ లో వైసీపీ పార్టీ  పనులు ప్రారంభిస్తారని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఏపీ లో తాను ఎలాగైతే పార్టీ ని నడిపించారో, తెలంగాణ లో అయన చెల్లెలు షర్మిల పార్టీ కి నాయకత్వాన్ని అందిస్తారని కూడా వార్తలు వచ్చాయి.. అయితే తెలంగాణ లో ని ప్రతిపక్షాలు దీన్ని ఎలా అర్థం చేసుకున్నాయంటే.. వైసీపీ తెలంగాణ కి రావడం చూస్తుంటే కేసీఆర్ కుట్రలో భాగమే అన్నారు.. ఇక్కడి ఓట్లను చీల్చడమే లక్ష్యంగా కేసీఆర్ పథకం వేశారని అన్నారు..

అయితే రాజకీయంగా ఎన్ని ఎత్తులు వేసినా తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేతలు అంటుంటే ఏపీ లో వైసీపీ పరిస్థితి వేరేలా ఉంది.. ఇప్పటికే జగన్ మోడీకి సన్నిహితంగా ఉంటున్నారు.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిన్నటి భారత్ బంద్ లో కూడా జగన్ సరిగ్గా పాల్గొనలేదు. పార్లమెంట్ లో వ్యవసాయ బిల్లును ఆమోదించిన ప్రభుత్వాలలో వైసీపీ కూడా ఉంది.. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ ని కాదని, తెలంగాణ లో కేసీఆర్ చెప్పినట్లు చేస్తాడా అనే వాదన మొదలవుతుంది.

ఏదేమైనా ఈ తాజా పరిణామాలతో జగన్ మాత్రం ఇప్పుడు నలిగిపోతున్నారట. తెలంగాణ లో వైసీపీ అడుగుపెడితే బిజెపికి తల నొప్పి అవుతుంది.  తద్వారా కేంద్ర బీజేపీ కి కోపం వచ్చి జగన్ పై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు.. పైగా రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం కూడా చర్చకు వస్తుంది.. అది ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే.. ఇలాంటి టైం లో మోడీకి ఎదురెళ్ళడం మంచిది కాదని అంటున్నారు. మరో వైపు జగన్ కి సన్నిహితుడైన కేసీఆర్ మాట వినకపోతే ఎదురయ్యే పరిణామాలు కూడా అంచనా వేస్తున్నారు.. తెలంగాణ లో బీజేపీ బలపడడం జగన్ ఎంత పెద్ద తలనొప్పి అయ్యిందో చూడండి..


ధోని, రైనా బాటలో మరో భారత ఆటగాడు

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>