MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla6c854a37-891e-4999-9559-bdd4fb61e916-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla6c854a37-891e-4999-9559-bdd4fb61e916-415x250-IndiaHerald.jpgకడప జిల్లాలో వైసీపీకి అనుకూలమైన నియోజకవర్గాల్లో ప్రొద్దుటూరు కూడా ఒకటి. మామూలుగానే కడప జిల్లాలో టీడీపీకి పెద్ద సీన్ లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే. ఇక ఎక్కువసార్లు కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల నుంచి ప్రొద్దుటూరు వైసీపీకి అడ్డాగా మారిపోయింది. వరుసగా వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ysrcp mla;shiva;prasad;siva prasad;tiru;congress;kadapa;mla;lord siva;proddatur;tdp;ycp;reddy;dookudu;partyహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ప్రొద్దుటూరు వైసీపీ అడ్డాగా మారిపోయిందా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ప్రొద్దుటూరు వైసీపీ అడ్డాగా మారిపోయిందా?ysrcp mla;shiva;prasad;siva prasad;tiru;congress;kadapa;mla;lord siva;proddatur;tdp;ycp;reddy;dookudu;partyWed, 09 Dec 2020 05:00:00 GMTకడప జిల్లాలో వైసీపీకి అనుకూలమైన నియోజకవర్గాల్లో ప్రొద్దుటూరు కూడా ఒకటి. మామూలుగానే కడప జిల్లాలో టీడీపీకి పెద్ద సీన్ లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే. ఇక ఎక్కువసార్లు కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల నుంచి ప్రొద్దుటూరు వైసీపీకి అడ్డాగా మారిపోయింది. వరుసగా వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తున్నారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివప్రసాద్ దూకుడుగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలని చేస్తున్నారు. కాకపోతే ఈ ఏడాదిన్నరలో ఎక్కువ అభివృద్ధి ఏమి జరగలేదు.

నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. రోడ్లని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ఇక రాజకీయంగా చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి బలంగా పాతుకుపోవడంతో ప్రొద్దుటూరులో టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ బలంగా ఉండటం వల్ల, టీడీపీ వీక్ గా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన మల్లెల లింగారెడ్డి పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు.

ఇక నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా పీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించడంతో లింగారెడ్డి సైలెంట్ అయిపోయారు. ప్రవీణ్‌కు నియోజకవర్గంపై పెద్దగా పట్టు దక్కలేదు. ఇదే సమయంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వరదరాజులు రెడ్డి వైఎస్సార్‌సీపీ వైపు రావడం, ఎమ్మెల్యే రాచమల్లుకు బాగా ప్లస్ అవుతుంది. మొత్తానికైతే భవిష్యత్‌లో ప్రొద్దుటూరులో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం చాలా కష్టమని అర్ధమైపోతుంది. కాకపోతే ఇంకా నియోజకవర్గంలోని సమస్యలని పరిష్కరిస్తే శివ ప్రసాద్‌కు తిరుగుండదు. అసలు భవిష్యత్‌లో ఇక్కడ టీడీపీకి గెలిచే ఛాన్స్ రాదు. మొత్తానికైతే ప్రొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ అడ్డాగా మారిపోయిందని చెప్పొచ్చు.




మోడీ వ్యూహం సక్సెస్.. వాణిజ్య దెబ్బ రుచి చూసిన చైనా..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>