PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/easy-moneyede4f62a-f7d7-48b6-bb55-590ac4388ce6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/easy-moneyede4f62a-f7d7-48b6-bb55-590ac4388ce6-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఆంధ్ర ప్రదేశ్ లో కాల్ మని కలకలం రేపుతోంది. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కాల్ మనీ మాఫియా పనులు రోజురోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి. తీసుకున్న అప్పుకు దిమ్మతిరిగే వడ్డీ వసూలు చేస్తూ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ వారి రక్తాన్ని దారుణంగా పీల్చేస్తున్నారు. తాజాగా, గుంటూరు జిల్లాలో కాల్ మనీ మాఫియా వేధింపులు తట్టుకోలేక ఇద్దరు దంపతులు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. తాడేపల్లికి చెందిన భార్గవి దంపతులు.. అదే ప్రాంతానికి చెందిన దుర్గ అనే మహిళ వద్ద రెండు సంవత్సరాలtadepalli-gudem;women;bhargavi;india;vijayawada;andhra pradesh;police;chief minister;sucide;woman;letter;traffic police;reddyతాడేపల్లిలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసిన దంపతులుతాడేపల్లిలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసిన దంపతులుtadepalli-gudem;women;bhargavi;india;vijayawada;andhra pradesh;police;chief minister;sucide;woman;letter;traffic police;reddyWed, 09 Dec 2020 19:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఆంధ్ర ప్రదేశ్ లో కాల్ మని కలకలం రేపుతోంది. గుంటూరు, విజయవాడ  ప్రాంతాల్లో కాల్ మనీ మాఫియా పనులు రోజురోజుకి  చాలా ఎక్కువైపోతున్నాయి. తీసుకున్న అప్పుకు దిమ్మతిరిగే వడ్డీ వసూలు చేస్తూ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ వారి  రక్తాన్ని దారుణంగా  పీల్చేస్తున్నారు. తాజాగా, గుంటూరు జిల్లాలో కాల్ మనీ మాఫియా వేధింపులు తట్టుకోలేక ఇద్దరు దంపతులు  ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. తాడేపల్లికి చెందిన భార్గవి దంపతులు.. అదే ప్రాంతానికి చెందిన దుర్గ అనే మహిళ వద్ద రెండు సంవత్సరాల క్రితం  2 లక్షలు అప్పుగా తీసుకుంది. ఇందుకు రూ. 100కి రూ. 30 వడ్డీ చెల్లించాల్సిందిగా దుర్గ షరతు విధించింది. దీంతో రెండేళ్లుగా నెలకు రూ.60 వేలు చొప్పున వడ్డీ దారుణంగా వసూలు చేస్తున్నారట.


కరోనా లాక్ డౌన్ కారణంగా వారికి ఎటువంటి ఆదాయం లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వడ్డీ చెల్లించడంలేదట. దీంతో తీసుకున్న అప్పు చెల్లించకుంటే చంపేస్తామని దుర్గ తమను బెదిరింపులకు గురిచేస్తోందని భార్గవి దంపతులు బాధపడటం జరిగింది. కాల్ మనీ గ్యాంగ్ ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట.. కాల్ మనీ వ్యాపారులకే పోలీస్ లు కూడా సపోర్ట్ ఇస్తున్నారట. దీంతో అప్పుతీర్చే మార్గం లేక భార్యాభర్తలిద్దరూ బుధవారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది.

దీనిపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే కేసు ఎందుకు నమోదు చేయలేదనే దానిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసమంటున్న తాడేపల్లిలోనే కాల్ మనీ వ్యాపారులు రెచ్చిపోతుండటంపై పలువురు కోపం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


అల్లు అర్జున్‌ను డామినేట్‌ చేసిన మహేశ్‌ !

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>