PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mahipalb04e8954-a4cd-49c6-ac8f-13be99d39055-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mahipalb04e8954-a4cd-49c6-ac8f-13be99d39055-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో పలు ఓటములతో టీ ఆర్ ఎస్ పార్టీ సతమతమవుతుంటే కొంతమంది టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల అరాచకం పార్టీ పేరును ఇంకా చెడగొడుతున్నాయి. ఇప్పటికే ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని మొన్నటి దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సాక్షిగా తేలింది. దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నంలో పార్టీ మంతనాలు, వ్యూహాలు రచిస్తుంటే కొంతమంది గులాబీ నేతలు తమకు ఉన్న అధికార గర్వాన్ని చూపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గించేది పోయి పెంచేలా చేస్తున్న ఈ చర్యలు ఇప్పుడు దేనికి దారి తీస్తాయో తెలీట్లేదు. mahipal;kcr;santhosh;telangana rashtra samithi trs;telangana;smart phone;mla;audio;reddy;santhossh jagarlapudi;v;partyగులాబీ ఎమ్మెల్యే ల అరాచకం బట్టబయలు.. ఆడియో టేప్ లో..?గులాబీ ఎమ్మెల్యే ల అరాచకం బట్టబయలు.. ఆడియో టేప్ లో..?mahipal;kcr;santhosh;telangana rashtra samithi trs;telangana;smart phone;mla;audio;reddy;santhossh jagarlapudi;v;partyWed, 09 Dec 2020 10:32:23 GMTపార్టీ సతమతమవుతుంటే కొంతమంది టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల అరాచకం పార్టీ పేరును ఇంకా చెడగొడుతున్నాయి. ఇప్పటికే ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని మొన్నటి దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సాక్షిగా తేలింది. దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నంలో పార్టీ మంతనాలు, వ్యూహాలు రచిస్తుంటే కొంతమంది గులాబీ నేతలు తమకు ఉన్న అధికార గర్వాన్ని చూపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గించేది పోయి పెంచేలా చేస్తున్న ఈ చర్యలు ఇప్పుడు దేనికి దారి తీస్తాయో తెలీట్లేదు.

ఇప్పటికే తెలంగాణ అధికారపక్ష నేతలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి సంచలనంగా మారుతున్నాయి. ఆమధ్య రసమయి ఆడియో క్లిప్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ ఫోన్ కాల్ లో ఓ సామాన్యుడితో అయన మాట్లాడిన తీరు చూస్తుంటే కేసీఆర్ కే కోపం వచ్చేలా ఉన్నాయి..  తాజాగా బయటకు వచ్చిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. పటాన్ చెరువు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాజాగా చెలరేగిపోయారు.

ఒక దినపత్రికకు చెందిన రిపోర్టర్ సంతోష్ పట్ల చెలరేగిపోయాడు. ఎంత మాట పడితే అంత మాట అనేసిన ఆయన మాటల్ని బీప్ లో వింటేనే వణుకు పుడుతుంది. ఇక.. బీప్ తీసేస్తే.. వినే వారందరి షాక్ తినక మానదు. ఆయన నియోజకవర్గంలోని అక్రమాలు.. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వార్త ఒకటి పేపర్లో రావటంతో ఆయన చెలరేగిపోయారు. ఏం సంతోష్.. ఇంటికి వస్తానన్నావ్? రాలేదేం? నీలా బలిసినోడ్ని అయితే కాదు.. మర్యాదగా ఇంటికిరా.. లేకుంటే కాళ్లు.. చేతులు నరుకుతా బిడ్డా అంటూ రాయలేని బూతుమాటల్నివాడేసిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇలాంటి చర్యలు పార్టీ పరువును మరింత తీసేలా చేస్తుంది..


జగన్ కేసీఆర్ కి హెల్ప్ చేస్తారా...?

తెలంగాణా పీసీసి చీఫ్ లో ఈ ముగ్గురిలో ఒకరు...!

కరోనా టీకా.. కేవలం రూ.250

ప్రపంచంలోనే 100 మంది శక్తిమంతమైన మహిళల్లో భారతీయ వనితలకు చోటు

త్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?

శివనిర్వాణతో విజయ్ దేవరకొండ?

గీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>