MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-do-you-know-how-many-happened-before-the-nebula-weddingdab28666-cb5b-4ccb-812a-bc229ec34647-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-do-you-know-how-many-happened-before-the-nebula-weddingdab28666-cb5b-4ccb-812a-bc229ec34647-415x250-IndiaHerald.jpgమెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. తొలిరోజు సంగీత్ సందర్భంగా కాబోయే వధూవరులతో పాటు మెగా హీరోలు స్టెప్పులేశారు. రెండోరోజూ మెహందీ వేడుక నిర్వహించారు. కాసేపట్లో నీహారిక, చైతన్యల వివాహం జరగనుంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. సాయంత్రం 7 గంటల 30 నిముషాలకు.. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్‌లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకోబోతోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా అక్కడకు చేరుకుని ప్రీ వెడ్డింగ్ సందడి మొదలుపెట్టిందిdo you know how many happened before the nebula we;pawan;chiranjeevi;allu arjun;niharika konidela;pawan kalyan;prema;ram pothineni;uday kiran;varun;varun sandesh;varun tej;media;marriage;love;husband;murder.;nagababu;allari;annayyaనీహారిక పెళ్లికి ముందు ఎన్ని జరిగాయో తెలుసా..!నీహారిక పెళ్లికి ముందు ఎన్ని జరిగాయో తెలుసా..!do you know how many happened before the nebula we;pawan;chiranjeevi;allu arjun;niharika konidela;pawan kalyan;prema;ram pothineni;uday kiran;varun;varun sandesh;varun tej;media;marriage;love;husband;murder.;nagababu;allari;annayyaWed, 09 Dec 2020 17:00:00 GMTనిహారిక పెళ్లి సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. తొలిరోజు సంగీత్  సందర్భంగా కాబోయే వధూవరులతో పాటు మెగా హీరోలు స్టెప్పులేశారు.  రెండోరోజూ మెహందీ వేడుక నిర్వహించారు. కాసేపట్లో నీహారిక, చైతన్యల వివాహం జరగనుంది.

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. సాయంత్రం 7 గంటల 30 నిముషాలకు.. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్‌లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకోబోతోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా అక్కడకు చేరుకుని ప్రీ వెడ్డింగ్ సందడి మొదలుపెట్టింది.

మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి వేడుకలో చిరు ఫ్యామిలీ హీరోలంతా సందడి చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యారు. దీంతో తమ్ముడు వచ్చాడని చెబుతూ.. నాగబాబు ఫొటో షేర్‌ చేశారు. ఈ వేడుకలకు పవన్ తనయుడు అకీరా కూడా హాజరయ్యాడు.

ఇక మెగా, అల్లు ఫ్యామిలీలు పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. అందరూ కలిసి దిగిన గ్రూప్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో అభిమానులు తెగ లైక్‌లు కొడుతున్నారు.

తన కుమార్తె నిహారికను పెళ్లి కుమార్తెను చేసిన వీడియోను.. తొలిరోజు వేడుకలంటూ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్‌ చేశారు నాగబాబు. నిహారికకు మంగళస్నానం చేయించడం, ముస్తాబు చేయడం.. ఆమెను కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించడం తదితర ఘట్టాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఈ ఫంక్షన్‌ పూర్తయ్యాక వధూవరులు అందరితో కలిసి ఉత్సాహంగా కోలాటాలు ఆడారు. రంగు రంగుల పువ్వులు.. తోరణాలు.. పిల్లల అల్లరి.. కుటుంబ సభ్యుల పెళ్లి సందడితో నిండిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సోమవారం రాత్రి జరిగిన సంగీత్‌ వేడుకలో నిహారిక-చైతన్యలతో పాటు మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు. కాబోయే వధూవరులు పలు పాటలకు నృత్యాలు చేశారు. తొలుత కటౌట్‌ గౌనులో మెరిసిన నిహారిక ఆపై ఎరుపు రంగు స్కర్ట్‌లో తళుక్కుమన్నారు. కాబోయే భర్త చైతన్యతో కలిసి పెదనాన్న చిరంజీవి పాటలకు స్టెప్పులేశారు.

నిహారికతో కలిసి అన్నయ్య రామ్ చరణ్‌ పాటలకు స్టెప్పులేశాడు. మధ్యమధ్యలో బన్నీ.. తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్స్‌తో చిందులేసి అలరించాడు.మామయ్య నాగబాబుతో కలిసి అల్లు అర్జున్‌ హంగామా చేస్తున్న మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తన చిట్టి చెల్లెల్ని అన్నయ్య వరుణ్ తేజ్‌ భుజాలపై మోసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తను ఎంతగానో ఇష్టపడే నిహారికకు చిరంజీవి ఖరీదైన బహుమతిని ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు కోట్ల రూపాయ‌ల విలువైన ప్రత్యేక‌ ఆభ‌ర‌ణాన్ని నిహారికకు అందించారట చిరు. పెళ్లి సందర్భంగా చిరంజీవి ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు నిహారికను ఎత్తుకున్న ఫొటోతో పాటు, ఇటీవల పెళ్లి కుమార్తెను చేసిన తర్వాత దిగిన సెల్ఫీని కలిపి సోషల్ మీడియా  వేదికగా షేర్‌ చేశారు మెగాస్టార్.

పెదనాన్నతో కలిసి నిహారిక సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోను నాగబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన ప్రేమ.. సమయం, వయసు అనే సరిహద్దులను దాటింది. ఆయన చిరునవ్వు ప్రతిక్షణాన్ని వేడుకలా మారుస్తుంది అంటూ ఆ ఫొటోను పోస్టు చేశారు. ఇలా సందడి సందడిగా నిహారిక పెళ్లి వేడుక జరుగుతోంది.


నిషేధమున్నా కూడా రమ్మీ ఆడినందుకు 70 లక్షలు సమర్పయామి!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>