MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda5e01f5cc-239d-4322-81eb-60c9cda161a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda5e01f5cc-239d-4322-81eb-60c9cda161a9-415x250-IndiaHerald.jpgవిజయదేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందా? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలే టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్నాయి. గతంలోనే వీరు కలిసి ఫిల్మ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత మాత్రం ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి సమాచారం రాలేదు. దాంతో, ఈ సినిమా ఉండదనే అభిమానులు అనుకున్నారు. అయితే, విజయ్, శివ నిర్వాణ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని తాజాగా ఇండస్ట్రీలో మళ్ళీ వార్తలు వినిపిస్తున్నాయి.vijay devarakonda;shiva;siva nirvana;vijay;vijay deverakonda;tollywood;cinema;majili;december;lord siva;letter;joseph vijay;shiva nirvana;ninnu kori;fighter;devarakonda;tuck jagadishశివనిర్వాణతో విజయ్ దేవరకొండ?శివనిర్వాణతో విజయ్ దేవరకొండ?vijay devarakonda;shiva;siva nirvana;vijay;vijay deverakonda;tollywood;cinema;majili;december;lord siva;letter;joseph vijay;shiva nirvana;ninnu kori;fighter;devarakonda;tuck jagadishWed, 09 Dec 2020 10:00:00 GMTవిజయదేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందా? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలే టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్నాయి. గతంలోనే వీరు కలిసి ఫిల్మ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత మాత్రం ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి సమాచారం రాలేదు. దాంతో, ఈ సినిమా ఉండదనే అభిమానులు అనుకున్నారు. అయితే, విజయ్, శివ నిర్వాణ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని తాజాగా ఇండస్ట్రీలో మళ్ళీ వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫైటర్' అనే సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే శివ నిర్వాణ నానీని హీరోగా పెట్టి 'టక్ జగదీశ్' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ చివరికి ముగుస్తుందని అంచన. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా షూటింగ్ తరువాత శివ నిర్వాణ వెంటనే విజయదేవరకొండతో తాను తీయబోయే సినిమాపై దృష్టిని పెట్టవచ్చు. అన్నట్టు విజయ్ తో తాను తెరకెక్కించబోయే సినిమాకి శివ నిర్వాణ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసాడట. శివ నిర్వాణ - విజయ్ సినిమా 2021లో సెట్స్ మీదకు వెళ్లనుందని ఒక పుకారు ఇండస్ట్రీలో నడుస్తోంది. 

ఈ వార్తలు నిజమయ్యి విజయ దేవరకొండతో శివ నిర్వాణ సినిమా ఒకవేళ తీస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానులలో నెలకొంది. ఎందుకంటే శివ నిర్వాణ ఇప్పటివరకు 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సున్నితమైన సినిమాలను తెరకెక్కించాడు. ఈ కారణంగా విజయ్ దేవరకొండని శివనిర్వాణ తనదైన శైలిలో తన సినిమాలో ఎలా చూపిస్తాడా అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో, ఈ వార్తలు నిజమో కావో, ఒకవేళ నిజమైతే విజయ్ ని శివ నిర్వాణ ఎలా చూపిస్తాడో వంటి అంశాలు తెలుసుకోవాలంటే మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే. 




జగన్ మరో సంచలన నిర్ణయం.. ఆ వ్యాధి కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకే.?

ప్రపంచంలోనే 100 మంది శక్తిమంతమైన మహిళల్లో భారతీయ వనితలకు చోటు

త్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?

గీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?

మోదీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేనా..? రైతు ఉద్య‌మ విస్త‌ర‌ణ‌తో బీజేపీ నేత‌ల్లో టెన్ష‌న్‌..

సలార్ లోనూ బాలీవుడ్ స్టార్ లే నటిస్తున్నారా..?

గ్రేటర్ లో నేడే ఆ డివిజన్ ఫలితం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>