PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-what-the-foreign-team-decided-on-the-vaccicde638d6-8824-43d8-9f82-8430bc823278-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-what-the-foreign-team-decided-on-the-vaccicde638d6-8824-43d8-9f82-8430bc823278-415x250-IndiaHerald.jpgహైదరాబాద్‌లో విదేశీ బృందం పర్యటన ముగిసింది. రాష్ట్రంలో తయారవుతున్న వాక్సిన్ల వివరాలు తెలుసుకున్నారు 64దేశాలు రాయబారులు. భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ను సందర్శించి.. టీకా పురోగతిని తెలుసుకున్నారు. తెలంగాణలోని ఫార్మా, ఇండస్ట్రీస్ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై సీఎస్ సోమేశ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. this is what the foreign team decided on the vacci;modi;kumaar;krishna;hyderabad;india;santoshamప్రపంచ శ్రేయస్సులో భారత్ తీరు భేష్..ప్రపంచ శ్రేయస్సులో భారత్ తీరు భేష్..this is what the foreign team decided on the vacci;modi;kumaar;krishna;hyderabad;india;santoshamWed, 09 Dec 2020 20:35:27 GMTకుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

64 దేశాలకు చెందిన‌ రాయ‌బారులు భార‌త్‌బ‌యోటెక్‌ను సంద‌ర్శించారు. వ్యాక్సిన్ పురోగ‌తి గురించి తెలుసుకునేందుకు విదేశీ రాయ‌బారులు హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. వారంతా భార‌త్‌బ‌యోటెక్ ఫార్మ‌సీ సంస్థ‌ను విజిట్ చేశారు. కోవాగ్జిన్  గురించి సంస్థ చైర్మ‌న్‌, ఎండీ డాక్ట‌ర్ కృష్ణ ఎల్లా విదేశీ రాయ‌బారుల‌కు వివ‌రించారు. జీనోమ్ వ్యాలీలోనే 33 శాతం టీకాలు ఉత్ప‌త్తి అవుతున్న‌ట్లు రాయ‌బారుల‌కు తెలిపారపు డాక్ట‌ర్ కృష్ణ. హైద‌రాబాద్‌లో ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపిన వ్యాక్సిన్  స‌దుపాయాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

భారత్‌ బయోటెక్‌తో పాటు బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ను సందర్శించారు విదేశీ ప్రతినిధులు. వ్యాక్సిన్ అభివృద్ధిలో ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించిన‌ట్లు తెలిపారు బయోలాజికల్‌ ఎండీ. ఐసీఎంఆర్‌తో క‌లిసి ప్లాస్మాతో యాంటీసెరా మందును  డెవ‌ల‌ప్ చేసింది బయోలాజికల్ ఫార్మా. భార‌త్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్ టీకాల‌పై విదేశీ ప్రతినిధులు స్పందించారు. ఇండియా సాధించిన పురోగ‌తి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. ప్రపంచదేశాల కోసం భారత్‌ పనిచేస్తోందని  ప్రశంసించారు.

తెలంగాణలోని ఫార్మా, ఇండస్ట్రీస్ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై విదేశీ రాయబారులకు సీఎస్ సోమేశ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఫార్మా ఇండస్ట్రీస్ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు.

మొత్తానికి హైదరాబాద్ లో విదేశీ బృందం పర్యటన ముగిసింది. హైదరాాబద్ లో తయారవుతున్న వ్యాక్సిన్ల వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కోవ్యాగ్జిన్ గురించి రాయబారులకు భారత్ బయోటిక్ సభ్యులు కూలంకషంగా వివరించారు. అంతేకాదు బయోలాజికల్-ఈని సందర్శించిన విదేశీ రాయబారులకు చాలా సమాచారం అందింది. ఇదిలా ఉంటే జీనోమ్ వ్యాలీలోనే 33శాతం టీకాలు తయారు కావడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రపంచ దేశాల కోసం భారత్ పనిచేస్తున్న తీరును విదేశీ ప్రతినిధులు కొనియాడారు.





అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>