MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tamanna-is-worried-about-why2b0cf00a-eaa2-4fc9-aa9d-7be189f2d1c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tamanna-is-worried-about-why2b0cf00a-eaa2-4fc9-aa9d-7be189f2d1c9-415x250-IndiaHerald.jpgతమన్నా అంటే గ్లామర్‌.. గ్లామర్‌ అంటే తమన్నా. నిన్నటివరకు ఇదే ఇమేజ్‌తో కెరీర్‌ గడిపేసిన మిల్కీబ్యూటీ.. ప్రస్తుతం పెర్పార్మెన్స్‌ రోల్స్‌కే ఓటేస్తోంది. గ్లామర్‌గా కనిపించడానికి ఎలాంటి అడ్డంకి చెప్పదు. అయితే.. తను పోషించే పాత్ర మాత్రం.. నటిగా ఒక మెట్టు పెంచేదై ఉండాలట. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఆమె పోషిస్తున్న రోల్స్‌ చూస్తుంటే.. మంచి నటి అన్న పేరు సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది తమన్నా. tamanna is worried about why;beauty;tamannaah bhatia;diwali;west bengal - kolkata;cinema;bahubali;love;blockbuster hit;saira narasimhareddyతమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!tamanna is worried about why;beauty;tamannaah bhatia;diwali;west bengal - kolkata;cinema;bahubali;love;blockbuster hit;saira narasimhareddyWed, 09 Dec 2020 18:12:19 GMTతమన్నా అంటే గ్లామర్‌.. గ్లామర్‌ అంటే తమన్నా. నిన్నటివరకు ఇదే ఇమేజ్‌తో కెరీర్‌  గడిపేసిన మిల్కీబ్యూటీ.. ప్రస్తుతం పెర్పార్మెన్స్‌ రోల్స్‌కే ఓటేస్తోంది. గ్లామర్‌గా కనిపించడానికి ఎలాంటి అడ్డంకి చెప్పదు. అయితే.. తను పోషించే పాత్ర మాత్రం.. నటిగా ఒక మెట్టు పెంచేదై ఉండాలట. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఆమె పోషిస్తున్న రోల్స్‌ చూస్తుంటే..  మంచి నటి అన్న పేరు సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది  తమన్నా.

డెబ్యూ మూవీ శ్రీ నుంచి..ఎఫ్‌2 వరకు అన్ని సినిమాలను అందంతో నింపేసింది తమన్నా.  పెర్‌ఫార్మెన్స్‌పరంగా మాట్లాడుకోవాలంటే.. 100 పర్సెంట్‌ లవ్‌... బాహుబలి.. సైరా వంటి కొన్ని సినిమాలే వున్నాయి. వీటి సంఖ్య పెంచుకోవాలన్న పట్టుదలతో ఉంది మిల్కీబ్యూటీ.

సైరా నరసింహారెడ్డి తర్వాత తమన్నా ఆలోచనా విధానం మారింది. సైరాలో స్టార్స్‌ చాలామంది వున్నా.. యాక్టింగ్‌లో అందరికంటే ఎక్కువ మార్కులు తమన్నాకే పడ్డాయి. ఇలా వచ్చిన పేరు ఆమెను ఉబ్బితబ్బిబ్బు చేసింది. ఇప్పటివరకు గ్లామర్‌గా కనిపించింది చాలు. ఇక నుంచి పెర్‌ఫార్మెన్స్‌పై దృష్టిపెడదామన్న నిర్ణయానికి వచ్చేసింది.  సంపత్‌నంది డైరెక్ట్‌ చేస్తున్న సీటీమార్‌లో మహిళా కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపించనుంది తమన్నా. ఇదే దర్శకుడు రవితేజాతో తీసిన బెంగాల్ టైగర్‌లో 'చూపులతో దీపావళి..' అంటూ.. ఒంపు సొంపులతో మెల్ట్‌ చేసిన తమన్నా.. సీటీమార్‌లో సీరియస్‌ రోల్‌ ప్లే చేస్తోంది.

మిల్కీ బ్యూటీ , సత్యదేవ్ జంటగా నటిస్తున్న చిత్రం ''గుర్తుందా శీతాకాలం''. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ 'లవ్ మాక్ టైల్' కు ఇది రీమేక్‌. ఇందులో తమన్నా క్యాన్సర్‌ పేషంట్‌గా నటిస్తోంది. ఈ రోల్ కావాలని  మిల్కీ బ్యూటీ పట్టుబట్టి మరీ సాధించుకుందట. ఈ పాత్ర అయితేనే.. పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ వుంటుందన్నది తమన్నా ఆలోచన. మొత్తానికి తమన్నా పెర్ఫామెన్స్ రోల్స్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. సైరా తీసుకొచ్చిన పేరును ప్రఖ్యాతలను నిలబెట్టుకునేందుకు తెగ కృషి చేస్తోంది. చూద్దాం.. తమన్నా కెరీర్ ముందు ముందు ఎలా సాగుతుందో.






కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>