PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajani6c0eba27-e597-4814-9d89-5114839990bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajani6c0eba27-e597-4814-9d89-5114839990bf-415x250-IndiaHerald.jpgతమిళనాట రాజకీయం కధే వేరుగా ఉంటుంది. అక్కడ వెండి తెర బొమ్మలకు రియల్ లైఫ్ లీడర్లకు పెద్ద తేడాను జనాలు చూపించరు. ఫుల్ ఎమోషన్స్ తో తమిళులు ఉంటారు. రీల్ హీరోలు తెర మీద ఏం చేస్తే అదే నిజం అనుకుంటారు. ఇక ద్రవిడ వాదం బలంగా పాతుకుపోయిన తమిళనాట అర్ధ శతాబ్దం పైగా రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోరు సాగుతోంది. అయితే అన్నా డీఎంకే. లేకపోతే డీఎంకే ఇలా సీన్ ఉంటుంది. rajani;rajinikanth;tiru;udhayanidhi stalin;m. karunanidhi;tamil;chief minister;tamilnadu;silver;silver screen;stalin;march;partyరజనీని లైట్ తీసుకుంటున్నారా....స్టాలిన్ సంగతేంటి ?రజనీని లైట్ తీసుకుంటున్నారా....స్టాలిన్ సంగతేంటి ?rajani;rajinikanth;tiru;udhayanidhi stalin;m. karunanidhi;tamil;chief minister;tamilnadu;silver;silver screen;stalin;march;partyWed, 09 Dec 2020 22:00:00 GMTవెండి తెర బొమ్మలకు రియల్ లైఫ్ లీడర్లకు పెద్ద తేడాను జనాలు చూపించరు. ఫుల్ ఎమోషన్స్ తో తమిళులు ఉంటారు. రీల్ హీరోలు తెర మీద  ఏం చేస్తే అదే నిజం అనుకుంటారు. ఇక ద్రవిడ వాదం బలంగా పాతుకుపోయిన తమిళనాట అర్ధ శతాబ్దం పైగా రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోరు సాగుతోంది. అయితే అన్నా డీఎంకే. లేకపోతే డీఎంకే ఇలా సీన్ ఉంటుంది.

ఇక ఇప్పటికి రెండు విడతలుగా అధికారానికి దూరమైన డీఎంకే ఇపుడు అధికారం కోసం రెడీగా ఉంది. స్టాలిన్ కరుణానిధి అసలైన వారసుడిగా రుజువు చేసుకున్నారు. స్టాలిన్ చేతిలోనే మొత్తం పార్టీ ఉంది. ఆయన అన్న అళగిరి అలకలు పోయినా కూడా డీఎంకే విషయంలో మాత్రం ఏ బెంగా బెదురూ లేదని అంటున్నారు. మొక్కవోని కార్యకర్తల బలం స్టాలిన్ దేనని అంటున్నారు. ఆయనే రేపటి రోజున ముఖ్యమంత్రి అని కూడా అంటున్నారు.


2016లో తొంబై  సీట్లు దాకా తెచ్చుకున్న డీఎంకేని నాడు నడిపింది కూడా స్టాలినేనని అంటున్నారు. ఇక సడెన్ గా రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా తలైవా రజనీకాంత్ చేసిన ప్రకటన అయితే తమిళనాడులో అనుకున్నంతగా ప్రకంపనలు పుట్టించకపోవడం విశేషం. రజనీ వస్తున్నాడు అంటే ఆ ఊపే వేరుగా ఉండాలి. కానీ అవునా అని కూడా అనకుండా అరవ రాజకీయం లైట్ తీసుకోవడంతోనే రజనీ పాలిటిక్స్ ఎలా ఉంటుందో అన్న చర్చ ఇపుడు మొదలైంది.

ఇక మే నెలలో ఎన్నికలు పెట్టుకుని జనవరిలో రజనీ పార్టీని పెడుతున్నారు. అంతే కాదు మార్చి వరకూ అణ్ణాత్తే  మూవీలో యాక్ట్ చేస్తారట. మరి పార్టీ ప్రచారానికి ఎక్కడ టైం ఉంది, రాష్టమంతా రజనీ తిరుగుతాడా, అది కుదురుతుందా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. మొత్తానికి పాతికేళ్ళుగా ఊరించి ఊరించి వస్తున్న రజనీ రాజకీయ బొమ్మ బ్యాలెట్ బాక్స్ వద్ద ఏమవుతుంది అన్న చర్చ మాత్రం సాగుతోంది.




రేపు సొంత జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>