MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-is-that-why-our-heroes-are-hesitant-91e4d44d-ea9d-44c2-9be9-231f9302f831-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-is-that-why-our-heroes-are-hesitant-91e4d44d-ea9d-44c2-9be9-231f9302f831-415x250-IndiaHerald.jpgమనవాళ్ల హీరోయిజం అంతా తెరపైనేనా? కెమెరా వెనకాల చాలా పిరికోళ్లు అంటున్నారు నెటిజన్లు. వ్యవసాయ చట్టంను వ్యతిరేకిస్తే.. మోడీని వ్యతిరేకించినట్టే అన్న కాన్సెప్ట్‌తో ఉన్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ‌ చేస్తే.. మోడీ దృష్టిలో శత్రువు అవుతామన్న భయం కాబోలు. వ్యవసాయ చట్టంతో లబ్దిపొందే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీని వ్యతిరేకించినట్టేనన్న లెక్కతో రైతు ఆందోళన వీళ్లకు పట్టడం లేదంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. is that why our heroes are hesitant;modi;balakrishna;jeevitha rajaseskhar;krishna vamshi;cinema;shatru1అందుకే మన హీరోలు వెనుకాడారా...?అందుకే మన హీరోలు వెనుకాడారా...?is that why our heroes are hesitant;modi;balakrishna;jeevitha rajaseskhar;krishna vamshi;cinema;shatru1Wed, 09 Dec 2020 23:26:28 GMTమోడీ దృష్టిలో శత్రువు  అవుతామన్న భయం కాబోలు. వ్యవసాయ చట్టంతో లబ్దిపొందే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీని వ్యతిరేకించినట్టేనన్న లెక్కతో  రైతు ఆందోళన వీళ్లకు పట్టడం లేదంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

ఇక బాలయ్య  అయితే.. రైతులంటే చాలా రెస్పెక్ట్  అంటాడు. ఏకంగా వాళ్ల కోసం కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు'  అనే సినిమా తీయాలనుకున్నాడు. ఓ ముఖ్య పాత్ర కోసం అమితాబ్‌ను బాలయ్య కలిసినా.. ఈ ప్రాజెక్ట్‌ వర్కవుట్ కాలేదు. రూలర్‌ మూవీలో రైతు గురించి అదిరిపోయే డైలాగ్‌ చెప్పిన బాలయ్య..  రియల్‌ లైఫ్‌లో అండగా నిలవలేకపోయాడు.

రైతు కష్టాలు పవన్‌కల్యాణ్‌కు తెలియంది కాదు. ఫామ్‌ హౌస్‌లోని రెండు ఎకరాల్లో వరి పండించే పవన్‌.. ప్రస్తుతం బిజెపికి మద్దతు ఇవ్వడంతో.. దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమంకు సపోర్ట్‌ చేయలేకపోతున్నాడా? రైతుల బాగోగులు కోరుకునే పవన్‌ నుంచి మద్దతు లేకపోవడం ఫ్యాన్స్‌కు కూడా షాకే.

పెద్ద హీరోలకు రాజకీయ పార్టీలు..ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఉండడంతో.. రైతు బంద్‌కు సపోర్ట్‌ చేయలేదనుకుంటే.. యంగ్ హీరోలు సైతం ఇదే దారిలో నడుస్తున్నారు.  తుఫాన్‌.. వరదలు.. ప్రమాదాల సమయంలో ఇట్టే స్పందిస్తే.. నటీనటులు  రైతు ఊసెత్తడం లేదు.  రైతు బాధ తెలియడం లేదా? భయపడుతున్నారా? అన్నది వాళ్లకే వదిలేశామంటున్నారు ఫార్మర్స్‌.

అదేమిటోగానీ.. సీనియర్‌ హీరోలు సైతం రైతుల విషయంలో గమ్ముగా తమకేదీ పట్టనట్టు వున్నారు. తెరపైన రైతుల గురించి చెప్పమంటే.. ఎక్కడలేని ఎమోషన్‌తో.. మాడ్యులేషన్‌తో గూజ్‌ బంప్స్‌ వచ్చేలా జీవిస్తారు. నిజ జీవితంలో మాత్రం రైతు అనే మాట ఎత్తడానికే మనసు రావడంలేదంటూ.. నెట్‌లో ట్రోలింగ్‌ కూడా వీళ్ల మనసు మార్చడం లేదు.


అయ్యప్పన్ కోసం బాదేస్తున్న తమన్..?

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>