PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aicc-committee-comes-to-hyderabad-on-wednesdaye2f38960-15b0-45df-a02c-2fa6a7f0af1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aicc-committee-comes-to-hyderabad-on-wednesdaye2f38960-15b0-45df-a02c-2fa6a7f0af1f-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికలు టీపీసీసీ అధ్యక్ష కుర్చీకి ఎసరు పెట్టాయి. కాంగ్రెస్ లోని అసంతృప్తిదారులు చేయలేని పనిని హైదరాబాద్ నగర పాలక ఎన్నికలు చేసేశాయి. ఆఖరికి ఢిల్లీ లోని అధిష్టానం పెద్దల్ని సైతం కదిల్చాయి. బుధవారం ఏఐసీసీ కమిటీ హైదరాబాద్ వస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పీఠంపై కొత్త ముఖాన్ని కూర్చోబెట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. గ్రేటర్ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ సారధ్యాన్ని కొనసాగించలేనని నైతిక బాధ్యత తీసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసారు. అధిష్ఠానం కూడా కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని జీర్ణింall india congress committee;kumaar;revanth;delhi;hyderabad;uttam kumar reddy nalamada;revanth reddy;congress;రాజీనామా;tpcc;letter;reddy;partyహైదరాబాద్ కి ఏఐసీసీ కమిటీహైదరాబాద్ కి ఏఐసీసీ కమిటీall india congress committee;kumaar;revanth;delhi;hyderabad;uttam kumar reddy nalamada;revanth reddy;congress;రాజీనామా;tpcc;letter;reddy;partyWed, 09 Dec 2020 15:00:00 GMT
గ్రేటర్ ఎన్నికలు టీపీసీసీ అధ్యక్ష కుర్చీకి ఎసరు పెట్టాయి. కాంగ్రెస్ లోని అసంతృప్తిదారులు చేయలేని పనిని హైదరాబాద్ నగర పాలక ఎన్నికలు చేసేశాయి. ఆఖరికి ఢిల్లీ లోని అధిష్టానం పెద్దల్ని సైతం కదిల్చాయి. బుధవారం ఏఐసీసీ కమిటీ హైదరాబాద్ వస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పీఠంపై కొత్త ముఖాన్ని కూర్చోబెట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. గ్రేటర్ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ సారధ్యాన్ని కొనసాగించలేనని నైతిక బాధ్యత తీసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసారు. అధిష్ఠానం కూడా కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆయన రాజీనామా అస్త్రం ఫలించింది. తాజాగా  ఏఐసీసీ కమిటీ  హైదరాబాద్ వస్తోంది. అధ్యక్ష పదవిని అధిష్టించాలని కోరుకుంటున్న నేతల నడుమ సయోధ్య సమకూర్చడంతో పాటు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడం  ఏఐసీసీ కమిటీ మీద ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా రాజీనామా లేఖ ఢిల్లీ పెద్దలకు పంపించారో లేదో...ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పదవికి తానే అర్హుడినేనని, కార్యకర్త మొదలు నాయకులందరినీ సమదృష్ష్టితో చూసి పార్టీని బలోపేతం చేస్తానంటూ ప్రకటించేశారు. ఆయనకు ఎప్పటినుంచో టీపీసీసీ అధ్యక్ష స్థానాన్ని పొందాలని కోరికగా ఉంది. ఆ విషయం వీలు చిక్కినప్పుడల్లా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.
ఇక, ఈ స్థానాన్ని పొందేందుకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రేవంత్ రెడ్డి అర్హుడంటూ మరో వాదన వినిపిస్తోంది. రేవంత్ రెడ్డిని అభిమానించేవాలెంతమంది ఉన్నారో... వ్యతిరేకించేవాళ్లూ అంతే మంది పార్టీలో ఉన్నారు. గతంలో ఓ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి తమపై అజమాయిషీ చేస్తామంటే సహించేది లేదంటూ వ్యతిరేక వర్గీయులు తమ వాదన వినిపిస్తున్నారు. ఇలా ఉత్తమ కుమార్ రెడ్డి రాజీనామా కారణంగా పార్టీలో వర్గాలు ప్రత్యక్ష ఆధిపత్య పోరుకు సిద్ధమయ్యాయి. 
ఈ పరిణామాలన్నీ గమనించిన ఢిల్లీ పెద్దలు పార్టీ లోని లుకలుకలు సరి చేసేందుకు, నేతల మధ్య సయోధ్య కూర్చేందుకు  ఏఐసీసీ కమిటీ కసరత్తు చేస్తుంది. నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంది వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చిన తర్వాతే కమిటీ మళ్ళీ ఢిల్లీ వెళ్తుందని సమాచారం. 



ఈ కారణంతో రజనీ కామెడి అయిపోతారా...?

అమరావతిలో అడుగు పెడుతున్న బిజెపి అగ్ర నేతలు...?

తెలుగు రాష్ట్రాల నుంచి కేబినేట్ లోకి ఈ ఇద్దరు...?

స్కిన్ టైప్ కు తగిన మాయిశ్చరైజర్ ను ఎలా పిక్ చేసుకోవాలి?

అప్పుడు ఉండేది ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు.. సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్..?

ఎత్తైన పర్వతం మరింత ఎత్తు పెరిగింది..!

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>