SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/ycp-tdp-jagan-naidu-bharath-bandh-modi-parliament91a04042-238b-491a-96e5-b1f0f24217de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/ycp-tdp-jagan-naidu-bharath-bandh-modi-parliament91a04042-238b-491a-96e5-b1f0f24217de-415x250-IndiaHerald.jpgఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు పార్టీలు కూడా గతంలో వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పార్లమెంటులో ఓట్లేశాయి. నరేంద్రమోడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టానికి మద్దతుగా రెండు పార్టీల ఎంపిలు మాట్లాడారు. అలాగే తర్వాత జరిగిన ఓటింగ్ లో కూడా అనుకూలంగానే ఓట్లేశారు. అలాంటిది ఇపుడు భారత్ బంద్ కు మద్దతిచ్చాయంటే విచిత్రమనే అనుకోవాలి. రెండు పార్టీలు కూడా ఎందుకు ప్లేట్లు ఫిరాయించాయంటే రైతాంగానికి భయపడే అనుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో రైతు సంఘాల డిమాండ్లకు పెరుగుతున్న మద్దతును గమనిస్తున్న రెండు పార్టీycp tdp jagan naidu bharath bandh modi parliament;kcr;hyderabad;telugu desam party;india;narendra modi;rtc;telugu;bus;fire;tdp;success;parliament;party;mantraహెరాల్డ్ సెటైర్ : మొత్తానికి రెండు పార్టీలను కలిపిన రైతు ఉద్యమం ?హెరాల్డ్ సెటైర్ : మొత్తానికి రెండు పార్టీలను కలిపిన రైతు ఉద్యమం ?ycp tdp jagan naidu bharath bandh modi parliament;kcr;hyderabad;telugu desam party;india;narendra modi;rtc;telugu;bus;fire;tdp;success;parliament;party;mantraWed, 09 Dec 2020 07:00:00 GMTఉప్పు నిప్పులాగుండే రెండు ప్రధాన పార్టీలను కలిపిన క్రెడిట్ వ్యవసాయ చట్టానికే దక్కుతుందనటంలో సందేహం లేదు. అందులోను ఒకసారి కాదు రెండుసార్లు ఇటు అధికార వైసీపీని అటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీని వ్యవసాయ చట్టం ఒకటిచేసింది. కేంద్రప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం భారత్ బంద్ జరిగిన విషయం తెలిసిందే. ఈ బంద్ కు అధికార, ప్రధాన ప్రతిపక్షం మద్దతిచ్చాయి. ప్రభుత్వ సహకారం లేకుండా భారత్ బంద్ సక్సెస్ అయ్యేది కాదు. ఎప్పుడైతే రైతు సంఘాలు భారత్ బంద్ అని ప్రకటించాయో వెంటనే ప్రభుత్వం సేవలు నిలిచిపోయాయి. ముందుగా ఆర్టీసీ బస్సులను నిలిపేసింది ప్రభుత్వం. తర్వాత విద్యాసంస్ధలను కూడా మూసేసింది. ప్రభుత్వ కార్యాలయాలను కూడా దాదాపు మూసేసినట్లే. దాంతో ప్రభుత్వం పరోక్షంగా బంద్ కు సహకరించినట్లే అయిపోయింది. ఇక టీడీపీ కూడా బంద్ కు మద్దతుగానే నిలిచింది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు పార్టీలు కూడా గతంలో వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పార్లమెంటులో ఓట్లేశాయి. నరేంద్రమోడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టానికి మద్దతుగా రెండు పార్టీల ఎంపిలు మాట్లాడారు. అలాగే తర్వాత జరిగిన ఓటింగ్ లో కూడా అనుకూలంగానే ఓట్లేశారు. అలాంటిది ఇపుడు భారత్ బంద్ కు మద్దతిచ్చాయంటే విచిత్రమనే అనుకోవాలి. రెండు పార్టీలు కూడా ఎందుకు ప్లేట్లు ఫిరాయించాయంటే  రైతాంగానికి భయపడే అనుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో రైతు సంఘాల డిమాండ్లకు పెరుగుతున్న మద్దతును గమనిస్తున్న రెండు పార్టీలు కూడా వేరే దారిలేకే మద్దతిచ్చాయని అర్ధమవుతోంది. ఏ పార్టీ కూడా రైతుల మద్దతు లేకుండా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.




మిగిలిన దేశం సంగతి ఎలాగున్నా ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు  మాత్రం బాగా అనుభవమే. అందుకనే రైతాంగం నుండి వ్యతిరేకత ఎదుర్కోవటం ఇష్టం లేకే మద్దతిచ్చాయి. ఇక తెలంగాణాలో అంటే ఎలాగూ మోడి ప్రభుత్వానికి కేసీయార్ వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి వ్యవసాయ చట్టానికి కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. అందుకనే భారత్ బంద్ అని రైతు సంఘాలు ప్రకటించగానే కేసీయార్ రెండో ఆలోచన లేకుండా మద్దతు ప్రకటించేశారు. హైదరాబాద్ లో కానీ రాష్ట్రంలో కానీ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. ఏపిలోని ప్రధాన రాజకీయ పార్టీల వ్యవహారమే విచిత్రంగా ఉంది. పార్లమెంటులో మద్దతుగా నిలబడి రోడ్లపైన మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పైగా అధికారపార్టీ చేస్తున్న టీడీపీ కూడా చేస్తు మళ్ళీ ఎదురు వైసీపీపై టీడీపీ ఆరపణలు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.




వైయస్సార్ పెన్షన్ కానుక తనిఖి నిలిపివేత..?

ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>