PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modhi-tentionc5b2adc2-e1b5-4ea4-b1f1-07eb5588cdf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modhi-tentionc5b2adc2-e1b5-4ea4-b1f1-07eb5588cdf2-415x250-IndiaHerald.jpgమోదీ ప్ర‌భుత్వానికి రైతుల ఉద్య‌మం ఊహించ‌ని షాక్‌లిస్తోంది. రైతు ఉద్య‌మానికి రోజురోజుకు మ‌ద్ద‌తు పెరుగుతుండ‌టంతో క‌మ‌ల‌నాథుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదం దేశ వ్యాప్తంగా పెరిగిపోతోంద‌న్న ఆందోళ‌న వారిలో నెల‌కొంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలను చర్చలకు పిలిచారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మంగళవారం సాయంత్రం నుంచి రైతు సంఘాలతో చర్చించిన ఆయన..ఇవాళ కేంద్రం ప్రతిపాదనలను పంపుతామని తెలిపారు. దీంతో ఇవాళ కేందmodhi tention;amit shah;bharatiya janata party;india;narendra modi;amith shah;job;minister;central government;punjab;partyమోదీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేనా..? రైతు ఉద్య‌మ విస్త‌ర‌ణ‌తో బీజేపీ నేత‌ల్లో టెన్ష‌న్‌..మోదీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేనా..? రైతు ఉద్య‌మ విస్త‌ర‌ణ‌తో బీజేపీ నేత‌ల్లో టెన్ష‌న్‌..modhi tention;amit shah;bharatiya janata party;india;narendra modi;amith shah;job;minister;central government;punjab;partyWed, 09 Dec 2020 10:00:00 GMTమోదీ ప్ర‌భుత్వానికి రైతుల ఉద్య‌మం ఊహించ‌ని షాక్‌లిస్తోంది. రైతు ఉద్య‌మానికి రోజురోజుకు మ‌ద్ద‌తు పెరుగుతుండ‌టంతో క‌మ‌ల‌నాథుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదం దేశ వ్యాప్తంగా పెరిగిపోతోంద‌న్న ఆందోళ‌న వారిలో నెల‌కొంది.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలను చర్చలకు పిలిచారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మంగళవారం సాయంత్రం నుంచి రైతు సంఘాలతో చర్చించిన ఆయన..ఇవాళ కేంద్రం ప్రతిపాదనలను పంపుతామని తెలిపారు. దీంతో ఇవాళ కేంద్రం- రైతు సంఘాల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఇక కేంద్రం ఇచ్చే ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ పేర్కొంది. ప్రతిపాదనలు అందిన తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది.



గ‌తంలో పలుమార్లు చర్చలు జరిగినా అవేవీ ఫలితం ఇవ్వకపోవటంతో.. కేంద్రం ప్రతిపాదనలను ఈసారైనా రైతు సంఘాలు అంగీకరిస్తాయా..? లేక ఉద్యమం కొనసాగిస్తాయా అనేది చర్చనీయంగా మారింది. మరోవైపు రోజురోజుకూ రైతు నిరసనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో వారిని శాంతింపజేసేందుకు కేంద్రం ఎలాంటి ప్రతిపాదనలను వారి ముందు ఉంచుతుందో అనే ఆసక్తి నెలకొంది దేశప్రజల్లో.అయితే స‌మ‌స్య‌ను ఏదో విధంగా కొలిక్కి తీసుకువ‌చ్చి ప‌రిష్క‌రించాల‌ని కొంత‌మంది బీజేపీ నేత‌లు యోచిస్తున్నారంట‌. సుదీర్ఘ‌కాలం పొడ‌గింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల‌నే ప్ర‌భుత్వంపై  వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతుండ‌టం విశేషం.



మ‌రోవైపు రైతు ఉద్య‌మానికి విప‌క్షాలు మ‌ద్ద‌తు ప‌లుకుతూ తాము రైతుల ప‌క్షానే ఉన్నామ‌ని, కేంద్రంలో రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం అధికారంలో ఉంద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. వాస్త‌వానికి రైతు ఉద్య‌మానికి భిన్న వర్గాల ప్ర‌జ‌ల నుంచి సానుభూతి ల‌భిస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టికే పంజాబ్ క్రీడాకారులు త‌మ‌కు అంద‌జేసిన అవార్డుల‌ను, బ‌హుమ‌తుల‌ను తిరిగి ఇచ్చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో రైతు ఉద్య‌మం మ‌రింత‌గా పెర‌గ‌కుండా, విస్త‌రించ‌కుండా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ప్ర‌భావితం చేసేలా కాకుండా నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆ పార్టీ అధిష్ఠానానికి నేత‌లు సూచిస్తున్నారంట‌. అయితే రైతు చ‌ట్టాల‌నే ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ నేప‌థ్యంలో కేంద్రంకు ఏం చేయాలో అర్థం కావ‌డం లేద‌ని స‌మాచారం.






గులాబీ ఎమ్మెల్యే ల అరాచకం బట్టబయలు.. ఆడియో టేప్ లో..?

తెలంగాణా పీసీసి చీఫ్ లో ఈ ముగ్గురిలో ఒకరు...!

కరోనా టీకా.. కేవలం రూ.250

ప్రపంచంలోనే 100 మంది శక్తిమంతమైన మహిళల్లో భారతీయ వనితలకు చోటు

త్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?

శివనిర్వాణతో విజయ్ దేవరకొండ?

గీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>