PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/corona-virus-effect-on-worold-wide-peopleac48965e-4128-40da-9174-b2833523478c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/corona-virus-effect-on-worold-wide-peopleac48965e-4128-40da-9174-b2833523478c-415x250-IndiaHerald.jpgభార‌త్‌లో క‌రోనా వ్యాక్సిన్ పంపిణీకి చ‌క‌చ‌క ఏర్పాట్లు జ‌రిగిపోతున్నాయి. వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన అనుమ‌తులు వ‌చ్చేస్తుండ‌టంతో యావత్‌ ప్రపంచం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడు వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌లు అత్య‌వ‌స‌ర వినియోగానికి భార‌త్‌లో ద‌ర‌ఖాస్తు కూడా చేసుకున్నాయి. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ నమోదు ప్రక్రియ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలోని హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ అయిన ఇన్‌స్టిట్యూషన్, నర్సింగ్ హోం, ఓపీడీ, క్లీనిక్ మొదలైన వాvaccine;delhi;central governmentభార‌త్‌లో వ్యాక్సిన్ పొందాలంటే అలా చేయాల్సిందే.. ఏంటో తెలుసాభార‌త్‌లో వ్యాక్సిన్ పొందాలంటే అలా చేయాల్సిందే.. ఏంటో తెలుసాvaccine;delhi;central governmentWed, 09 Dec 2020 07:23:49 GMTఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ నమోదు ప్రక్రియ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలోని హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ అయిన ఇన్‌స్టిట్యూషన్, నర్సింగ్ హోం, ఓపీడీ, క్లీనిక్ మొదలైన వాటిల్లో పనిచేసే సిబ్బంది, తోపాటు హెల్త్‌కేర్ వర్కర్స్ పేర్లను పంపించాలని కోరింది. వ్యాక్సిన్ పంపిణీ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించ‌డానికి ప్ర‌భుత్వం ఓ యాప్ క్రియేట్ చేసింద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ మంగ‌ళ‌వారం విలేక‌రుల స‌మావేశంలో తెలిపారు.


ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఈ యాప్ పేరు Co-WIN. ఎల‌క్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వ‌ర్క్ (eVIN)కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్ష‌న్‌. వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌లో భాగ‌మ‌య్యే ప్ర‌తి ఒక్క‌రికీ ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. అడ్మినిస్ట్రేట‌ర్లు, వ్యాక్సినేట‌ర్లు, వ్యాక్సిన్ అందుకునే వాళ్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి మొద‌టి, రెండో ద‌శ‌ల్లో ఈ వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, క‌రోనాపై పోరాడుతున్న ఇత‌ర ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కు ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే వాళ్ల‌కు డేటా మొత్తం కేంద్రం సేక‌రించింది. మొద‌టి ద‌శ‌లో ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు, రెండో ద‌శ‌లో ఎమర్జెన్సీ వ‌ర్క‌ర్ల‌కు ఇస్తారు. మూడో ద‌శ‌లో క‌రోనా ప్ర‌మాదం ఎక్కువ‌గా పొంచి ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తారు. ఈ ద‌శ నుంచే వ్యాక్సిన్ కోసం రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు.


ఈ ప్ర‌క్రియ అంతాCo-WIN యాప్ ద్వారానే న‌డుస్తుంది. ఇందులో మొత్తంగా ఐదు మాడ్యూల్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేట‌ర్ మాడ్యూల్‌, రిజిస్ట్రేష‌న్ మాడ్యూల్‌, వ్యాక్సినేష‌న్ మాడ్యూల్‌, బెనిఫిషియ‌రీ అక్‌నాలెడ్జ్‌మెంట్ మాడ్యూల్‌, రిపోర్ట్ మాడ్యూల్ ఉంటాయి. ఇందులోని రిజిస్ట్రేష‌న్ మాడ్యూల్ ద్వారా వ్యాక్సినేష‌న్ కోసం రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. మొత్తంగా వ్యాక్సినేష‌న్ మొద‌టి విడ‌త‌లో భాగంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తామ‌ని రాజేష్ భూష‌ణ్ స్ప‌ష్టం చేశారు. దేశంలో కోటిమంది హెల్త్‌వర్కర్స్‌కు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత రెండు కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తరువాత 27 కోట్లమంది సీనియర్ సిటిజన్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. 


వైయస్సార్ పెన్షన్ కానుక తనిఖి నిలిపివేత..?

ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>