PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-take-a-step-head-to-ysrcp773bfa3f-0b15-4df6-9c6d-b69b3eb0cf91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-take-a-step-head-to-ysrcp773bfa3f-0b15-4df6-9c6d-b69b3eb0cf91-415x250-IndiaHerald.jpgగత కొన్ని నెలల నుంచి ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనిపించని విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పవన్ పెద్దగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన సందర్భాలు లేవు. ఏదో ఒకసారి ఇసుక విషయంలో ఆందోళన చేసిన పవన్ తర్వాత హడావిడి చేయలేదు. కరోనా వచ్చాక పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితయ్యారు. అలాగే సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయారు. pawan;pawan;pawan kalyan;andhra pradesh;janasena;2019;cinema;government;ycp;janasena party;eluru;vవైసీపీకి పవన్ స్ట్రోక్..ఇలా సెట్ చేశారా?వైసీపీకి పవన్ స్ట్రోక్..ఇలా సెట్ చేశారా?pawan;pawan;pawan kalyan;andhra pradesh;janasena;2019;cinema;government;ycp;janasena party;eluru;vWed, 09 Dec 2020 04:00:00 GMTఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనిపించని విషయం తెలిసిందే.  2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పవన్ పెద్దగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన సందర్భాలు లేవు. ఏదో ఒకసారి ఇసుక విషయంలో ఆందోళన చేసిన పవన్ తర్వాత హడావిడి చేయలేదు. కరోనా వచ్చాక పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితయ్యారు. అలాగే సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయారు.

దీంతో పవన్ మళ్ళీ పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేశారనే విమర్శలు రావడం మొదలయ్యాయి. అయితే ఎన్ని విమర్శలు వచ్చిన పవన్ మాత్రం తనదైన శైలిలో ముందుకెళుతూనే ఉన్నారు. తక్కువ సమయంలోనే ప్రజా సమస్యలపై పోరాటం చేసిన దాని ఎఫెక్ట్ మాత్రం గట్టిగానే ఉంటుంది. ఇటీవల కూడా పవన్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులని పరామర్శించే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందనే వచ్చింది. అయితే పవన్ పర్యటనకు ఎంత స్పందన ఉన్న ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. రైతులని ఆదుకునే కార్యక్రమం చేస్తూనే ఉంది.

దీంతో ఆ విషయంపై ప్రతిపక్షాలు విమర్శలు కాస్త తగ్గించాయి. ఇదే క్రమంలో ఏలూరులో వింత వ్యాధిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వ్యాధికి కారణాలపై ప్రభుత్వ వైద్య బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. ఇదే సమయంలో పవన్ కల్యాణ్.. జనసేన తరపున కూడా ఓ వైద్య బృందం ఏలూరులో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. చాలా మంది బాధితులు మూర్చ వ్యాధి లక్షణాలతో వచ్చారని, వ్యాధి వ్యాపించడానికి కారణమేంటో లోతైన అధ్యయనం జరగాలని వైద్యబృందం వెల్లడించింది.

అయితే ఇలాంటి విషయాల్లో పవన్ వెంటనే స్పందించి సొంత డబ్బుని సైతం వాడి ప్రజలకు అండగా ఉంటారని జనసైనికులు చెబుతున్నారు. దీని వల్ల ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ కదలిక వస్తుందని, ఓ రకంగా చెప్పాలంటే పవన్ పరోక్షంగా ప్రభుత్వానికి స్ట్రోక్ ఇచ్చినట్లే అని జనసైనికులు హడావిడి చేస్తున్నారు.





మోడీ వ్యూహం సక్సెస్.. వాణిజ్య దెబ్బ రుచి చూసిన చైనా..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>