PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana-congress-politics545f1351-82c3-4034-9f2e-1b6dfac2d494-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana-congress-politics545f1351-82c3-4034-9f2e-1b6dfac2d494-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీ అధినేతలు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని పూర్వ వైభవాన్ని తిరిగి పునరుద్ధరించగల నాయకుడి కోసం మంతనాలు జరుపుతున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పలు చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో ఈ పదవి కోసం ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య పోటీ జరుగుతోందని టాక్ నడుస్తోంది.telangana congress politics;revanth;thirtha;vishwa;telangana;revanth reddy;congress;రాజీనామా;tpcc;yuva;reddy;partyటీపీసీసీ అధ్యక్ష పదవి ఏ రెడ్డిని వరించనుందో...?టీపీసీసీ అధ్యక్ష పదవి ఏ రెడ్డిని వరించనుందో...?telangana congress politics;revanth;thirtha;vishwa;telangana;revanth reddy;congress;రాజీనామా;tpcc;yuva;reddy;partyWed, 09 Dec 2020 09:00:00 GMTకాంగ్రెస్ పార్టీ లో ఒకప్పుడు తెలంగాణ గడ్డపై చక్రం తిప్పిన ఈ పార్టీ ఇప్పుడు ఆ గడ్డ ప్రజలకు కనీసం కంటికి కూడా కనబడడంలేదు. ఓ వెలుగు వెలిగిన గడ్డపైనే.. ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది కాంగ్రెస్. గ్రేటర్ ఎన్నికల్లో అయితే పూర్తిగా చతికిలపడిపోయింది. మళ్లీ పాత రంగులు అద్దుకొని దగదగ మెరిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేవలం 2,24,528 ఓట్లు (5శాతం) తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓవైపు సీనియర్‌ నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడి కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ... మనస్తాపం చెందిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కు షాక్ తగిలింది.

దాంతో ఇప్పుడు పార్టీలో ఎంతో కీలకమైన ఈ పదవి పగ్గాలను ఎవరికి ఇవ్వాలి అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది ??? కాంగ్రెస్ పార్టీ అధినేతలు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని పూర్వ వైభవాన్ని తిరిగి పునరుద్ధరించగల నాయకుడి కోసం మంతనాలు జరుపుతున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పలు చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో ఈ పదవి కోసం ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య పోటీ జరుగుతోందని టాక్ నడుస్తోంది. ఒకరు యంగ్, డైనమిక్, ఫైర్ బ్రాండ్ కు మారు పేరయిన రేవంత్ రెడ్డి అయితే మరొకరు సీనియర్ నేత కొమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నా.... సరైన గుర్తింపు దక్కడం లేదని ఈయన ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.... అయినా పార్టీ పగ్గాల విషయంలో ఈయనపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని దాటుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

అయితే కోమటిరెడ్డి బిజెపికి దీటుగా నిలబడడం కష్టమే అంటున్నారు. మరోవైపు సానుకూలంగా ఉంటూ అందరినీ కలుపుకుపోయే పరిస్థితి కోమటిరెడ్డి వద్ద లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందులోనూ రేవంత్ రెడ్డి తో పోలిస్తే పార్టీ కి ఫైర్ జతచేసి ఊపు అందించగల నేర్పు తక్కువే అంటున్నారు. అటు రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా ఈ పదవికి ఫిట్ అవుతాడు అన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు యువ నాయకుడు, అందులోనూ ప్రతిపక్షాలకు దీటుగా నిలబడగల ధైర్యం, పార్టీని అభివృద్ధిలోకి తెచ్చుకునేందుకు గల వివేకం.. ఇలా అన్ని రేవంత్ రెడ్డి లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే ఓవైపు యువ నాయకుడు.. మరోవైపు సీనియర్ నేత...! ఈ ఇద్దరిలో అధిష్టానం ఏ రెడ్డి కి పార్టీ పగ్గాలను అందించనుందో చూడాలి.


ఏలూరులో వింత వ్యాధి కారణం ఏంటీ...?

వైయస్సార్ పెన్షన్ కానుక తనిఖి నిలిపివేత..?

ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>