MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaydevarakonda93402bd0-7a6d-48bf-b566-fa3b7d929f38-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaydevarakonda93402bd0-7a6d-48bf-b566-fa3b7d929f38-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి సంచలనంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత అది మరో స్థాయికి చేరింది. సినిమాకు అతను తీసుకునే పారితోషికం నాలుగింతలు పెరిగింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ కూడా సంచలన విజయం సాధించడంతో దేశం చూపు మొత్తం దేవరకొండ వైపు మరలిందనడం అతిశయోక్తి కాదు. vijaydevarakonda;govinda;karan johar;geetha;govi;puri jagannadh;srikanth;vijay;vijay deverakonda;hyderabad;mercedes-benz;bmw;ford;india;bollywood;tollywood;cinema;telugu;arjun reddy;car;hindi;kabir singh;interview;blockbuster hit;remake;hero;joseph vijay;arjun 1;reddy;fighter;devarakondaరౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?vijaydevarakonda;govinda;karan johar;geetha;govi;puri jagannadh;srikanth;vijay;vijay deverakonda;hyderabad;mercedes-benz;bmw;ford;india;bollywood;tollywood;cinema;telugu;arjun reddy;car;hindi;kabir singh;interview;blockbuster hit;remake;hero;joseph vijay;arjun 1;reddy;fighter;devarakondaWed, 09 Dec 2020 12:00:00 GMTఅర్జున్ రెడ్డి సంచలనంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత అది మరో స్థాయికి చేరింది. సినిమాకు అతను తీసుకునే పారితోషికం నాలుగింతలు పెరిగింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ కూడా సంచలన విజయం సాధించడంతో దేశం చూపు మొత్తం దేవరకొండ వైపు మరలిందనడం అతిశయోక్తి కాదు. హిందీ అభిమానులు కూడా ఈ సినిమా తెలుగులో చేసిన హీరో ఎవరబ్బా? అంటూ ఈ రౌడీ గురించి ఆరాలు తీసారు. ప్రస్తుతం అతడు కరణ్ జోహార్ - పూరి జగన్నాధ్‌తో కలిసి పాన్ ఇండియా లెవెల్‌లో ఫైటర్ మూవీ చేస్తున్నాడంటే ఇదే కారణం.

ఇంతగా ఎదిగేస్తున్న దేవరకొండ ఆస్తుల రేంజ్ ఎంతో తెలుసు కోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే మన రౌడీ కొనుక్కున్న సొంత ఇంటిని పక్కన పెట్టేసి, ఆయన రెగ్యులర్ గా ఉపయోగించే ఐదు అత్యంత ఖరీదైన వస్తువుల వివరాలు పరిశీలిద్దాం. దేవరకొండ గ్యారేజీలోని అనేక లగ్జరీ కార్లలో bmw 5 సిరీస్ సెడాన్ ఒకటి. విలాసవంతమైన ఇంటీరియర్స్ గొప్ప సేఫ్టీ ఫీచర్స్ తో అసాధారణ సౌకర్యాన్ని అందించే బెస్ట్ - ఇన్ - క్లాస్ సెడాన్ కార్ ఇదని టాక్. చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ కారే వాడతారు. దీని ధర రూ .60 లక్షలు.

ఖరీదైన ఫోర్డ్ ముస్తాంగ్ కారు కూడా దేవరకొండ సొంతం. తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో ముస్తాంగ్ జీటీ కారు ప్రపంచంలోనే తనకు ఇష్టమైన కార్లలో ఒకటని రౌడీ హీరో ప్రకటించారు. విజయ్ ఈ కారు రూ .75 లక్షలు పెట్టి కొన్నాడు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ సి క్లాస్ కారు విజయ్ గ్యారేజీలో ప్రత్యేకం అట. ఈ విలాసవంతమైన ఎస్‌యూవీలో విజయ్.. తరచుగా షూటింగులకు వెళ్తుంటాడు. అలాగే అప్పుప్పుడూ హైదరాబాద్ లో కొన్నిచోట్ల ఈ కార్లో షికారు చేస్తూ అభిమానుల కంట పడ్డాడు కూా. దీని ధర రూ .60 లక్షలు.

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విజయ్ దేవరకొండ 15 కోట్ల విలువ చేసే ఇండివిడ్యువల్ ఇంటిని కొనుక్కున్నారు. ఇది శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ ఇంటికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ వివరాలన్నీ తెలిసిన అభిమానులు.. ఈ రౌడీ లైఫ్ చాలా కాస్ట్‌లీ గురూ అనేస్తున్నారు. మరి మీరేమంటారు?


జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"

కొత్త చట్టాల్లో ఏముంది? రైతుల ఆందోళనలకు అర్థమేంటి?

అలరించే అందాల అనంతగిరి

జగన్ ని టార్గెట్ చేసిన సోము

స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. ఉచితంగానే అకౌంట్లోకి 25000..?

విజయవంతమైన భారత్ బంద్.. మోడీ కి సంకట స్థితి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>