PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-sanchayita-carry-with-bjpe2163d69-68ae-4572-b87b-24efdeb0dac4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-sanchayita-carry-with-bjpe2163d69-68ae-4572-b87b-24efdeb0dac4-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో సంచయిత ఓ హాట్ టాపిక్. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్న కుమార్తెగా పరిచయమైన సంచయిత ఇప్పుడు అదే అశోక్ ఫ్యామిలీకి చుక్కలు చూపిస్తుంది. మొదట్లో బీజేపీ సభ్యురాలుగా ఉన్న సంచయితని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిరాజుని తప్పించి సింహాచలం, మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమించారు. sanchayita;ashok;bharatiya janata party;india;andhra pradesh;2019;media;capital;marriage;prime minister;minister;tdp;central government;ycp;narendraసంచయిత కమలం దారిలోనే ఉన్నారా?సంచయిత కమలం దారిలోనే ఉన్నారా?sanchayita;ashok;bharatiya janata party;india;andhra pradesh;2019;media;capital;marriage;prime minister;minister;tdp;central government;ycp;narendraWed, 09 Dec 2020 02:00:00 GMTఏపీ రాజకీయాల్లో సంచయిత ఓ హాట్ టాపిక్. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్న కుమార్తెగా పరిచయమైన సంచయిత ఇప్పుడు అదే అశోక్ ఫ్యామిలీకి చుక్కలు చూపిస్తుంది. మొదట్లో బీజేపీ సభ్యురాలుగా ఉన్న సంచయితని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిరాజుని తప్పించి సింహాచలం, మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమించారు.

ఇక ఈ నియామకం కరెక్ట్ కాదని, అశోక్ ఫ్యామిలీతో పాటు టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. ఆనందగజపతిరాజు నుంచి విడాకులు తీసుకుని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంచయిత తల్లికి ఇక్కడ ఎలాంటి అధికారాలు లేవని వాదిస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం గజపతి రాజు ఫ్యామిలీ వారసురాలుగా సంచయితకు సింహాచలం ఆలయ ఛైర్మన్ పదవితో పాటు, కీలకమైన మాన్సస్ బాధ్యతలు కూడా అప్పగించారు.

అయితే ఇలా బాధ్యతలు వచ్చాక సంచయిత వైసీపీకి అనుకూలమైన సభ్యురాలుగా మారిపోయారు. సంచయిత కూడా మళ్ళీ బీజేపీలో కనిపించిన సందర్భాలు లేవు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యమానికి దేశంలోని విపక్ష పార్టీలన్నీ మద్ధతు ఇస్తున్నాయి. అలాగే రైతులు చేపట్టిన భారత్ బంద్‌కు సైతం మద్ధతు ఇచ్చారు.

ఇదే క్రమంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సైతం రైతుల బంద్‌కు మద్ధతు ఇచ్చింది. కానీ అదే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు చట్టాలకు సంచయిత గజపతి మద్దతు పలికారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అండతో మాన్సస్ పగ్గాలు చేపట్టిన ఆమె... తాజాగా కేంద్రానికి మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి మార్పు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందని, కానీ మంచి కోసమే ఆ మార్పు అని.. దాన్ని స్వాగతించాల్సిందేనని సంచయిత సోషల్ మీడియా వేదికగా చెప్పారు. వ్యవసాయ రంగానికి సంస్కరణలు చాలా అవసరమని, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీని బట్టి చూస్తే సంచయిత ఇంకా కమలం దారిలోనే ఉన్నట్లు కనబడుతోంది.




కీపింగ్ లో కె.ఎల్.రాహుల్ పాట్లు.. ధోని ఉండుంటేనా..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>