PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/water9e2e3c78-880b-4693-b745-4ed66480a9e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/water9e2e3c78-880b-4693-b745-4ed66480a9e8-415x250-IndiaHerald.jpgచాల మందికి భోజనం చేసే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. అయితే భోజనం చేసే సమయంలో నీళ్లు అధికంగా తీసుకుంటే ప్రమాదమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక మనిషి ఏం తిన్నా అది జీర్ణం అవడం అత్యంత ఆవశ్యకం. జీర్ణ క్రియ సక్రమంగా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం.water;tara;ayurveda;shaktiభోజనం చేసేప్పుడు నీళ్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ..!?భోజనం చేసేప్పుడు నీళ్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ..!?water;tara;ayurveda;shaktiWed, 09 Dec 2020 06:00:00 GMT
అయితే ముఖ్యంగా భోజనం చేస్తున్న, చేసే సమయంలో మన కడుపులో రెండు ప్రక్రయలు జరుగుతాయి. అందులో ఒకటి జీర్ణ క్రియ. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. రెండోది కిణ్వ ప్రక్రియ. దీంతో మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాక.. కిణ్వ ప్రక్రియ జరగక ఒకటే చోట ఉండే ప్రమాదం ఉందట. ఇది అజీర్తి సమస్యలకు ముఖ్య కారణమట.ఇది కడుపులో ఏ ఏ పార్ట్ కు ఆహారం కావాలో సప్లై చేస్తుంది. ఈ రెండింటినీ సక్రమంగా పనిచేసుకోనిస్తేనే తిన్న ఆహారం ఫలితాన్నిస్తుంది. అలా కాకుండా.. కొంత మంది అన్నం తినేప్పుడు నీటిని ఎక్కువగా తాగుతారు. ఇది అత్యంత ప్రమాదకరం. నీటిని తీసుకుంటే.. పైన చెప్పిన రెండు క్రియలు ఆగిపోయే ప్రమాదం ఉంది.

అందుకే పెద్దవాళ్ళు తినే సమయంలో నీళ్లు తాగకూడదంటారు. ఇక అన్నం తిన్న 15, 20 నిమిషాల తర్వాతే నీటిని తాగడం మంచిదట. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతున్నది. ఆహారం సరిగా జీర్ణమైతేనే.. శరీరంలోని భాగాలకు, ఎముకలకు శక్తి అందుతుంది. లేకుంటే అది కుళ్లిపోయి పొట్టలో యూరిక్ యాసిడ్, కొలస్ట్రాల్ వంటివి పెరుగుతాయి. అంతేగాక గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనట. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన ఉదరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అది సరిగ్గా పనిచేస్తేనే.. దాని పనిని దానిని చేసుకోనిస్తేనే మనం మనగలుగుతాం. లేదంటే... అనవసరమైన రోగాలను కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు వైద్య నిపుణులు.


డిసెంబ‌ర్ 9వ ‌తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>