PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kisan-andolanb0619c7b-02d4-4a7a-8b6a-b8ce8893a17a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kisan-andolanb0619c7b-02d4-4a7a-8b6a-b8ce8893a17a-415x250-IndiaHerald.jpgపాతబడిన చట్టాలతో కొత్త వ్యవస్థను నిర్మించలేం...ప్రధాని నరేంద్రమోడీ. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ల దగ్గర అన్నదాతను సాగిలపడేలా చేయడమే...ఆ మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న విపక్ష నేతలందరి మాట ఇది. ప్రధానంగా వ్యవసాయాధారిత దేశంలో జై జవాన్ తర్వాత అందరికి అన్నం పెట్టే అన్నదాతని జై కిసాన్ అంటూ కీర్తించిన ఘనత ఈ దేశం సొంతం. అలాంటి నేపథ్యంలో అన్నదాతకు ఆగ్రహం వచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతన్న రోడ్డున పడ్డాడు. మొదట పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన kisan andolan;kirti;delhi;india;haryana - chandigarh;narendra modi;రాజీనామా;prime minister;job;minister;vegetable market;letter;jawaan;central government;punjab;corporate;parliament;gharshana;railకొత్త చట్టాల్లో ఏముంది? రైతుల ఆందోళనలకు అర్థమేంటి?కొత్త చట్టాల్లో ఏముంది? రైతుల ఆందోళనలకు అర్థమేంటి?kisan andolan;kirti;delhi;india;haryana - chandigarh;narendra modi;రాజీనామా;prime minister;job;minister;vegetable market;letter;jawaan;central government;punjab;corporate;parliament;gharshana;railWed, 09 Dec 2020 12:00:00 GMT
పాతబడిన చట్టాలతో కొత్త వ్యవస్థను నిర్మించలేం...ప్రధాని నరేంద్రమోడీ. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ల దగ్గర అన్నదాతను సాగిలపడేలా చేయడమే...ఆ మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న విపక్ష నేతలందరి మాట ఇది. ప్రధానంగా వ్యవసాయాధారిత దేశంలో జై జవాన్ తర్వాత అందరికి అన్నం పెట్టే అన్నదాతని జై కిసాన్ అంటూ కీర్తించిన ఘనత ఈ దేశం సొంతం. అలాంటి నేపథ్యంలో అన్నదాతకు ఆగ్రహం వచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతన్న రోడ్డున పడ్డాడు. మొదట పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ట్రాక్టర్ల ద్వారా ఢిల్లీ చేరుకొని వణికించే చలిలో ఆందోళన మొదలెట్టారు. ఆ ఆందోళన చినికి చినికి గాలివానై దేశంలోని నాలుగు చెరుగులా విస్తరించింది. కడకు భారత్ బంద్ గా మారి నిరసనలతో హోరెత్తింది. ఇంతలా వ్యతిరేకించాల్సిన అంశాలు కొత్త చట్టాల్లో ఏమున్నాయి? ఈ చట్టాలు ఎందుకింత వివాదాస్పదమయ్యాయి. ఆ చట్టాలను రద్దు చేసేంతవరకూ ఆందోళన విరమించేది లేదని రైతన్నలెందుకంత పట్టుదలగా ఉన్నారు? విపక్షాల మద్దతులో నిజాయితీ ఎంత? వీరి మద్దతు లో కూడా రహస్య ఎజెండా ఏదైనా ఉందా? రాజకీయాలేమైనా ఉన్నాయా? ఇవన్నీ సగటు మనిషిని వెంటాడుతున్న ప్రశ్నలు.
అసలు కొత్త చట్టాలు ఏమి చెబుతున్నాయి. మొదటి బిల్లు...వ్యవసాయ స్వేచ్చాయుత మార్కెట్ బిల్లు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒకే దేశం...ఒకే మార్కెట్ విధానం. ఈ విధానం వల్ల అన్నదాతలు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఇదే పెద్ద వివాదాస్పదమైనది. కారణం... కార్పొరేట్లు అన్నదాతల ఉత్పత్తులపై అజమాయిషీ చేస్తారని...వారికే అమ్ముకోమంటూ రైతన్నలపై ఒత్తిడి తెచ్చి ఆగమాగం చేస్తారని అతి ప్రధాన అభియోగం. వ్యవసాయ స్వేచ్చాయుత మార్కెట్ బిల్లు రాకపోయినా... ఇప్పుడు ఉనికిలో ఉన్న చట్టాల్లో కూడా దేశవ్యాప్తంగా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. దీనిపై ఎటువంటి ఆంక్షలు లేవు. ప్రత్యేకించి బిల్లు రూపేణా వచ్చినందున ఇది వివాదాస్పదమయిందని కొంతమంది మేధావులు అంటున్నారు. 
రెండో బిల్లు ఒప్పంద వ్యవసాయ చట్టంగా పేర్కొనవచ్చు. మూడో బిల్లు నిత్యావసరాల వస్తువుల సవరణ బిల్లు. ఈ మూడు బిల్లులు ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టగానే కేంద్ర మంత్రి మండలిలో ఫుడ్ ప్రోసెసింగ్ మినిస్టర్ హర్ సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే మిత్రపక్షమైన అకాలీదళ్ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇలాంటి వ్యతిరేకతల నడుమ రాష్ట్రాలు కూడా వ్యవసాయ అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనంటూ ఇదే విషయాన్ని రాజ్యాంగంలోని 7  షెడ్యూల్ చెప్తోందని వాదిస్తున్నారు. కేంద్రం రాష్ట్రాల జాబితాలోకి చొచ్చుకుని వచ్చి ఈ తరహా బిల్లులు ప్రవేశపెట్టడం అన్యమని అంటున్నాయి. ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందంటున్నాయి. దీనికి కేంద్రం సమాధానమిస్తూ వ్యవసాయ సంబంధిత వాణిజ్యమనేది కేంద్ర జాబితాలోని అంశమంటోంది. ఈ రకంగా కేంద్రం, రాష్ట్రాల నడుమ ఘర్షణ వైఖరి నెలకొంది. నచ్చిన ప్రాంతంలో నచ్చినట్లు ఉత్పత్తులు అమ్ముకోవచ్చనే స్వేచ్ఛను రైతులకు ఈ బిల్లుల ద్వారా ఇస్తున్నామని...రైతులెందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే అంటోంది. ఆన్ లైన్ విధానంలో కూడా విక్రయించుకోవచ్చని చెబుతున్నామని అంటోంది. రైతు ఉత్పత్తులను నచ్చిన చోట అమ్ముకునే స్వేచ్ఛ పేరుతో బయటకి వెళ్లి అమ్ముకుంటున్నప్పుడు ప్రైవేట్ వ్యాపారాలు, కార్పొరేట్ దిగ్గజాలు ఆ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇస్తారన్న నమ్మకం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓ రకంగా చెప్పుకోవాలంటే రైతు ఉత్పత్తులపై మార్కెట్ ధర నిర్ణయాధికారం ప్రైవేట్ వ్యక్తులకు పోతుందని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్న చట్టాలు చాలని, కొత్త చట్టాల ద్వారా కొత్త భయాలు ఇవ్వొద్దని కోరుతూ తమ డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, రాస్త రోకోలు, రైల్ రోకోలు, భారత్ బంద్ లు...ఇలా అనేక మార్గాలుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలకు విపక్షాలు కూడా తోడయ్యాయి. దాంతో, తప్పని సరిగా మళ్ళీ చర్చలకు కేంద్రం దిగి వచ్చింది. 



జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"

అలరించే అందాల అనంతగిరి

జగన్ ని టార్గెట్ చేసిన సోము

స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. ఉచితంగానే అకౌంట్లోకి 25000..?

విజయవంతమైన భారత్ బంద్.. మోడీ కి సంకట స్థితి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>