PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎం జగన్ ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ వద్దు అని చెప్తున్నా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పుడు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిys jagan;kumaar;bhavana;jagan;andhra pradesh;court;central government;ycp;dookudu;mantraఎన్నికల సంఘం వద్ద తేల్చుకునే ఆలోచనలో జగన్...?ఎన్నికల సంఘం వద్ద తేల్చుకునే ఆలోచనలో జగన్...?ys jagan;kumaar;bhavana;jagan;andhra pradesh;court;central government;ycp;dookudu;mantraTue, 08 Dec 2020 21:00:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎం జగన్ ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ వద్దు అని చెప్తున్నా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పుడు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఎన్నికలను వాయిదా వేసే అవకాశం లేదని రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు సీఎం జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సుప్రీంకోర్టులో కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తేల్చుకునే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే జరిగే నష్టాలను ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ మేరకు ఎంపీల బృందాన్ని అదేవిధంగా రాష్ట్ర అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపించి ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీనియర్ మంత్రులు అదే విధంగా కొంతమంది అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారని టాక్. రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారని రాజకీయవర్గాలు అంటున్నాయి. దీనిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏమిటనే దానిపై రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నయి. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పారు.


కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి బ్రేకులు పడ్డాయా..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>