MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rrr-aliabhatt0f73b332-bdb7-4a31-b5a8-ec246bccc339-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rrr-aliabhatt0f73b332-bdb7-4a31-b5a8-ec246bccc339-415x250-IndiaHerald.jpgసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే సినిమాల‌ను మాత్రం ఆయ‌న తీరిగ్గా సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డ చెక్కుతాడ‌నే అప‌వాదు కూడా ఉంది.rrr;ntr;ram charan teja;jr ntr;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;ram madhav;rrr movie;cinema;hero;nandamuri taraka rama rao;seetharamaraju;research and analysis wing;josh;seetharama raju;chitramరాజమౌళి తీరుతో విసిగిపోతున్న తారక్, చెర్రీరాజమౌళి తీరుతో విసిగిపోతున్న తారక్, చెర్రీrrr;ntr;ram charan teja;jr ntr;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;ram madhav;rrr movie;cinema;hero;nandamuri taraka rama rao;seetharamaraju;research and analysis wing;josh;seetharama raju;chitramTue, 08 Dec 2020 11:26:00 GMTసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే సినిమాల‌ను మాత్రం ఆయ‌న తీరిగ్గా సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డ చెక్కుతాడ‌నే అప‌వాదు కూడా ఉంది. అందుకే జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ముద్దుగా ఆయ‌న‌ను జ‌క్క‌న్న అని పిలుచుకుంటూ ఉంటాడు. మ‌రి ఈ అమ‌ర శిల్పి జ‌క్క‌న్న ఏడాదిగా ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ ఆర్ ఆర్‌ని చెక్కుతూనే ఉన్నాడు. అస‌లే సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి చెక్కే ఈ ద‌ర్శ‌కుడికి క‌రోనా ప్ర‌భావంతో షూటింగ్‌ను ఎన్నో అవాంత‌రాల మ‌ధ్య జ‌రుపుతున్నాడు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కి ఎట్ట‌కేల‌కు సిద్ధం చేయాల‌నే క‌సితో ఉన్నాడు. క‌థ‌, క‌థ‌నం, బ‌డ్జెట్‌, హీరోల విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌ని ఈ ద‌ర్శ‌కుడిపై ఆ మ‌ధ్య జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ఓ షాకింగ్ కామెంట్ చేశాడు. 


ప‌నిలో ప‌నిగా హీరో రాంచ‌ర‌ణ్ కూడా దానిని ధృవీక‌రించేశాడు. ముఖ్యంగా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్.. రాజమౌళి పనితీరు ఎలా ఉంటుందో తెలుపుతూ అన్నీ చెప్పేశారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన సెట్స్‌పై ఇలాగే ఉంటారంటూ ఓపెన్ అయ్యారు. పైగా కాస్త వెరైటీగా ఆలోచించి అందరూ కంప్లైంట్స్ చేసిన ఈ వీడియోను జక్కన్న బర్త్ డే కానుకగా రిలీజ్ చేసింది చిత్ర బృందం... కొద్దిగా విశ్రాంతి తీసుకుందామ‌ని అనుకుంటున్న సమయంలోనే రాజమౌళి కష్టతరమైన షాట్స్ షూట్ చేద్దామంటారని జక్కన్నపై షాకింగ్ కామెంట్ ను వదిలారు ఎన్టీఆర్. ఒక్క షాట్ తీయడానికే గంట‌ల‌త‌ర‌బ‌డ సమయం తీసుకుంటారని, ఆయన పర్ఫెక్షన్‌తో మమ్మల్ని చావగొట్టేస్తుంటారంటూ అన్నీ ఓపెన్‌గా చెప్పేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి.. నందమూరి అభిమానుల కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ రెడీ చేస్తున్నారు.


ఆర్ ఆర్ ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం అని తెలిపిన మేకర్స్.. ఈ సినిమా కోసం రాజమౌళి ఎక్కడా తగ్గడం లేదని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి గత రికార్డులన్నీ చెరిపేయడం ఖాయం అని, అంత శ్రద్దగా జక్కన్న ఈ మూవీని చెక్కుతున్నారని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆకాశాన్నంటే అంచనాలున్నాయి.




లీటర్ పెట్రోల్ ధర 40 రూ.లు.. బిజెపి ఎంపీ కీలక వ్యాఖ్యలు..?

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>