PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr482ac87d-f900-48ba-8400-45b09212f852-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr482ac87d-f900-48ba-8400-45b09212f852-415x250-IndiaHerald.jpgజాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డానికి వెనుకాడ‌బోమ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ప‌లుమార్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతాంగ ఉద్య‌మాలకు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఢిల్లీని పంజాబ్ రైతులు ముట్ట‌డిస్తున్నారు. శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం రోజురోజుకు రైతుల పోరాటం ఉధృత‌మ‌వుతోంది. ఎన్డీఏ ప్ర‌భుత్వానికి అనేక రాజ‌కీయ ప‌క్షాలు కూడా మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్నాయి. అయితే ఈ ప‌రిస్థితుల్లో జాతీయ‌ రాజ‌కీయాల్లోకి వెళkcr;kcr;bharatiya janata party;telangana;job;central government;punjab;partyబీజేపీకి కేసీఆర్ స్ట్రాంగ్ పంచ్‌... ఏం చేస్తున్నారో తెలుసా..?బీజేపీకి కేసీఆర్ స్ట్రాంగ్ పంచ్‌... ఏం చేస్తున్నారో తెలుసా..?kcr;kcr;bharatiya janata party;telangana;job;central government;punjab;partyTue, 08 Dec 2020 08:27:38 GMTతెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ప‌లుమార్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతాంగ ఉద్య‌మాలకు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఢిల్లీని పంజాబ్ రైతులు ముట్ట‌డిస్తున్నారు. శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం  రోజురోజుకు రైతుల పోరాటం ఉధృత‌మ‌వుతోంది. ఎన్డీఏ ప్ర‌భుత్వానికి అనేక రాజ‌కీయ ప‌క్షాలు కూడా మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్నాయి. అయితే ఈ ప‌రిస్థితుల్లో జాతీయ‌ రాజ‌కీయాల్లోకి వెళితే ఖ‌చ్చితంగా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌నే భావ‌న‌తో కేసీఆర్ ఉన్న‌ట్లుగా ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య ప్ర‌చారం జ‌రుగుతోంది.


కేసీఆర్ త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న వాద‌న‌ను కొంత‌మంది వినిపిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గాని, ఆ పార్టీ ముఖ్యులు గానీ దీనిపై ఎలాంటి స్పంద‌న తెలియ‌జేయ‌లేదు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ప్ర‌జాక్షేత్రంలోకి తీసుకెళ్తున్నారు. బీజేపీయేత‌ర రాష్ట్రాల పాలిత ప్ర‌భుత్వాలు, పార్టీల అధ్య‌క్షుల‌తో కేసీఆర్ ట‌చ్‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఆయా పార్టీల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూట‌మిని ఏర్పాటు చేస్తార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీ బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న జాతీయ‌వాద రాజ‌కీయ స్టెప్‌పై దేశ వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంటోంది. ఇప్ప‌టికే రైతు ప‌క్ష‌పాతిగా దేశ వ్యాప్తంగా కేసీఆర్ పేరు గ‌డించారు.


ఆయ‌న జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తే ఖ‌చ్చితంగా బీజేపీకి ఎంతో కొంత ఇబ్బందిని క‌లిగిస్తుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇక త్వరలోనే తన సీఎం పదవిని.. కేటీఆర్‌కు అప్పగించబోతున్నట్లు వార్తలు ఊపందుకుంటున్నాయి. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా సమయం కేటాయించి.. ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. వాస్త‌వానికి ఇలాంటి వాద‌నే గ‌తంలో బ‌లంగా వినిపించినా వాస్త‌వం రూపం దాల్చ‌లేద‌ని కొంత‌మంది గుర్తు  చేస్తుండ‌గా, అప్ప‌టి ప‌రిస్థితి ఇప్ప‌టి ప‌రిస్థితి వేరంటూ మ‌రికొంత‌మంది పేర్కొంటుండ‌టం విశేషం. ఏదిఏమైనా త్వ‌ర‌లో కేసీఆర్ క్లారిటీ ఇస్తార‌ని అనిపిస్తోంది. వేచి చూద్దాం..!


తెలంగాణ లో మళ్ళీ జగన్ పార్టీ

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>