PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmer2652d6a6-66fb-4b46-b399-4818dbb66a97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmer2652d6a6-66fb-4b46-b399-4818dbb66a97-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు సంబంధించి కూడా తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ కు చెందిన వేలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కి విపక్షాలు పిలుపునిచ్చాయి. దీనికి మంచి స్పందన వస్తుంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈ బంద్ లో పాల్గొంటున్నారు. వ్యాపారులు అదే విధంగా కార్మికులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. దాదాపుగా వfarmer;poorna;delhi;india;haryana - chandigarh;madhya pradesh - bhopal;odisha;rajasthan;capital;job;uttar pradesh;central government;punjab;noidaభారత్ బంద్: వేలాది మంది రైతులు ఢిల్లీ బాట... ఉద్యమం మరింత తీవ్రంభారత్ బంద్: వేలాది మంది రైతులు ఢిల్లీ బాట... ఉద్యమం మరింత తీవ్రంfarmer;poorna;delhi;india;haryana - chandigarh;madhya pradesh - bhopal;odisha;rajasthan;capital;job;uttar pradesh;central government;punjab;noidaTue, 08 Dec 2020 09:52:04 GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు సంబంధించి కూడా తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ కు చెందిన వేలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కి విపక్షాలు పిలుపునిచ్చాయి. దీనికి మంచి స్పందన వస్తుంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈ బంద్ లో పాల్గొంటున్నారు. వ్యాపారులు అదే విధంగా కార్మికులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.

దాదాపుగా విపక్షాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇక దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా భారత్ బంద్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు. ఒడిశా, మహారాష్ట్రలో రైళ్లను నిలిపివేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో 13 రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చలిని సైతం లెక్క చేయకుండా రోడ్లపై ఆందోళన కొనసాగిస్తున్న రైతులు... ఎలాంటి పరిస్థితిలో కూడా తాము వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. భారత్ బంద్ నేపధ్యం ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసారు.

ఢిల్లీ యుపి నోయిడా లింక్ రోడ్డు 24 నెంబర్ జాతీయ రహదారి మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్న రైతులు... భారీగా ఆహార పదార్ధాలను కూడా తెస్తున్నారు. రైతుల ఆందోళనతో సింఘు, టిక్రి, జారోదా, ఘజిపూర్, చల్లా, నోయిడా లింక్ రోడ్డు, జటిక్రా సరిహద్దు రహదారులు మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హరియనా,నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే వాహనాలను మరో దారివైపు మళ్లిస్తు నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాల మొహరించారు. రేపు మరోసారి రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరుపుతుంది. ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిపినా రైతులు వెనక్కు తగ్గలేదు.


కెఫే డే సీఈఓగా మాళవిక

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>