MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasan3e94d94c-b4d9-4988-a5cc-3669c63bc592-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasan3e94d94c-b4d9-4988-a5cc-3669c63bc592-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ, అందాల ముద్దుగుమ్మ శృతి హసన్ కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’. తెలుగులో మూడేళ్ళ గ్యాప్ తర్వాత శృతి హాసన్ ఈ చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎక్కుతున్న ఈ చిత్రం పక్కా యాక్షన్ ఎంటర్ టైన్ అని తెలుస్తోంది.sruthihasan;ravi;gopichand;shruti;shruti haasan;kranthi;kranti;ravi teja;sruthi;makar sakranti;cinema;telugu;sankranthi;director;instagram;traffic police;mass;krack;chitramమాస్ మహారాజా చేతిలో ఓడిపోయి.. వీడియో షేర్ చేసిన శృతి హాసన్!మాస్ మహారాజా చేతిలో ఓడిపోయి.. వీడియో షేర్ చేసిన శృతి హాసన్!sruthihasan;ravi;gopichand;shruti;shruti haasan;kranthi;kranti;ravi teja;sruthi;makar sakranti;cinema;telugu;sankranthi;director;instagram;traffic police;mass;krack;chitramTue, 08 Dec 2020 18:00:00 GMTమాస్ మహారాజా రవితేజ, అందాల ముద్దుగుమ్మ శృతి హసన్ కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’. తెలుగులో మూడేళ్ళ గ్యాప్ తర్వాత శృతి హాసన్ ఈ చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎక్కుతున్న ఈ చిత్రం పక్కా యాక్షన్ ఎంటర్ టైన్ అని తెలుస్తోంది. గతంలో శృతి - రవితేజ - గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'బలుపు' సినిమా ఎంత పెద్ద హిట్లో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ ముగ్గురి కలయికలో వస్తున్న 'క్రాక్' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ మొత్తం గోవాలో స్టే చేస్తోంది. ఈ క్రమంలో షూటింగ్ ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్.. షూటింగ్ మధ్యలో రవితేజతో ఫ్లాంక్ (ఓ ఎక్సర్ సైజు) ఛాలెంజ్ లో పోటీ పడింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో రవితేజతో పోటీపడిన శృతి ఓడిపోయింది. 'క్రాక్' షూటింగ్ సరదాగా జరిగిపోయిందని.. రవితేజతో రెండో సినిమా షూటింగ్ కూడా చాలా ఫన్నీ గా సాగిందని ఆమె చెప్పింది. ‘‘ఈ టీమ్ లో నన్ను కూడా ఓ భాగం చేసినందుకు డైరెక్టర్ గోపీచంద్ కి థ్యాంక్స్. సంక్రాంతి కి ఫ్యామిలీతో కలసి క్రాక్ సినిమా చూడండి’’ అంటూ శృతి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘క్రాక్’ సినిమాను వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

సినిమాలో రవితేజ మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించ బోతున్నారు. ‘బలుపు’, ‘డాన్ శీను’ వంటి హిట్ చిత్రాల తర్వాత గోపీచంద్ - రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నిహారిక పెళ్లిపై మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్..!!

ఆ జిల్లాలో యువనేత తప్పు... బాబు కొంప ముంచుతుందా...?

భిక్షాటన చేస్తున్న ఐఐటీ పూర్వ విద్యార్థి

బ్రేకింగ్: జనసేన బిజెపి అత్యవసర సమావేశం... ఎందుకు...?

స్వార్థం కోసం రైతుల నోట్లో మట్టికొడుతున్నారు: కిషన్ రెడ్డి

బ్రిటన్ ప్రధానిపై హరీష్ రావు ప్రసంశలు

జగన్ కీలక నిర్ణయం... పేదలకు ఉపయోగమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>