TVSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/roja-ycpd860907d-2e47-4d5e-927c-0171eecf38c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/roja-ycpd860907d-2e47-4d5e-927c-0171eecf38c0-415x250-IndiaHerald.jpgసీనియర్ నటిగా, జబర్దస్త్ జడ్జ్‌గా మరియు అధికార వైసీపీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వివిధ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆర్కే రోజాకు అనూహ్యంగా బెదిరింపులు ఎదురయ్యాయి. ఆమెకు భయమంటే ఏంటో చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబాభాస్కర్‌. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అనసూయ తొడగొట్టి సవాల్ విసిరింది. చూసుకుందాం.. మీ ప్రతాపమో మా ప్రతాపమో అంటూ ఛాలెంజ్ చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందిroja;anasuya bharadwaj;bhaskar;sekhar;roja;adinarayanareddy;baba bhaskar;jabardasth;december;mla;pistachio;ycp;duvvada jagannadham;sekhar master;research and analysis wing;nagari;master;anasuya 1;katthiఎమ్మెల్యే రోజాకి డ్యాన్స్ మాస్టర్ బెదిరింపులు!ఎమ్మెల్యే రోజాకి డ్యాన్స్ మాస్టర్ బెదిరింపులు!roja;anasuya bharadwaj;bhaskar;sekhar;roja;adinarayanareddy;baba bhaskar;jabardasth;december;mla;pistachio;ycp;duvvada jagannadham;sekhar master;research and analysis wing;nagari;master;anasuya 1;katthiTue, 08 Dec 2020 20:10:00 GMTజబర్దస్త్ జడ్జ్‌గా మరియు అధికార వైసీపీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వివిధ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆర్కే రోజాకు అనూహ్యంగా బెదిరింపులు ఎదురయ్యాయి. ఆమెకు భయమంటే ఏంటో చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబాభాస్కర్‌. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అనసూయ తొడగొట్టి సవాల్ విసిరింది. చూసుకుందాం.. మీ ప్రతాపమో మా ప్రతాపమో అంటూ ఛాలెంజ్ చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏంటి.. అర్థం కాలేదా? అదేనండీ ప్రతి స్పెషల్ డేకి ఓ స్పెషల్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ బుల్లితెర ఆడియన్స్‌‌ని ఉర్రూతలూగించే ఈటీవీ బృందం ఈ సారి తమలో తామే పోటీ పెట్టుకుంది. ఈ డిసెంబర్ 31 నాడు జబర్దస్త్, ఢీ పోటాపోటీగా రంగంలోకి దిగబోతున్నాయట. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వీడియో రిలీజ్ చేసి జనాల్లో ఆసక్తి రేకెత్తించారు. ఈ వీడియోలో రోజా, బాబా భాస్కర్, తాగుబోతు రమేష్, అనసూయ, హైపర్ ఆది ఎవరికి వారు తమ తమ పదునైన డైలాగ్స్‌తో రెచ్చిపోయారు.



2021 స్వాగత వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న ఈ టీవీలో ‘డీజే 2021’ పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌ ప్రసారం కానుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరగనున్న ఈ వేడుకలను ‘ఢీ’ స్టేజ్‌పై చేయాలని భావించింది జబర్ధస్త్ టీమ్. ఈ మేరకు 'ఢీ' సెట్‌లోకి వెళ్లి ఆ స్టేజ్ కావాలని అడిగింది. దానికి శేఖర్ మాస్టర్ నో చెప్పడంతో ‘ఢీ’లో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరినీ కిడ్నాప్ చేసి ఓ చోట బంధించామని, స్టేజ్ ఇవ్వకుంటే వారిని విడిచిపెట్టేదే లేదని జబర్ధస్త్ కమెడియన్లు బెదిరించారు. దీంతో ‘ఢీ’ టీమ్‌కు సపోర్ట్‌గా బాబాభాస్కర్ రంగంలోకి దిగారు. జబర్దస్త్ యూనిట్‌పై బెదిరింపులకు దిగుతూ రోజా టీమ్‌కు ఓ వీడియో పంపారు బాబాభాస్కర్. శేఖర్‌ మాస్టర్ అమాయకుడు కదా అని 'ఢీ' స్టేజ్‌పైకి వచ్చిమరీ వార్నింగ్‌ ఇచ్చి వెళ్తున్నారా. మీరు వేస్ట్‌ రా. మా వాళ్లని వదిలేయండి లేదంటే డిసెంబర్‌ 31 రాత్రి అసలు భయమేంటో చూపిస్తాం అంటూ కత్తి పట్టుకొని గట్టిగానే బెదిరించారు. దీనిపై రియాక్ట్ అయిన రోజా రెడీ అనేసింది. దీంతో వెంటనే తొడగొట్టి సవాల్ విసురుతూ అనసూయ రెచ్చిపోయింది. ఇక చివరగా బ్రహ్మానందం అమాయకంగా చెప్పిన మాటలు ఈ ప్రోమో వీడియోలో కొసమెరుపు. డిసెంబర్‌ 31 రాత్రి కొత్త సంవత్సరం స్వాగత కార్యక్రమాలు చాలా ఘనంగానే ప్లాన్ చేసినట్లున్నారు.



" style="height: 227px;">




300 కోట్ల కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన నటుడు కళ్యాణ్!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>