PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubde41533-afd6-4a42-becc-43d20bf806a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubde41533-afd6-4a42-becc-43d20bf806a4-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది.. ప్రభుత్వం వద్దని చెపుతూనే ఎక్కడ ఎన్నికలు ముంచుకొస్తాయో అని అన్ని ఏర్పాట్లు చేస్తుంది.. స్థానిక లీడర్ లను ఎంపిక చేయడంతో పాటు అక్కడ గెలిచే విధి విధానాలను ఏర్పాటు చేసుకుంటుంది.. అన్ని పార్టీ లు స్థానికంగా అధికారం తెచ్చుకోవాలని సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ విశాఖ మేయర్ ఎన్నికలకు అన్ని సమకూరుస్తుంది. విశాఖ లో మేయర్ పదవి చంద్రబాబు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఎపుడో మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రముఖ న్యాయవాది డీవీ సుబ్బారావుని బరిchandrababu;cbn;ntr;srinivas;jagan;congress;vishakapatnam;capital;mla;lawyer;february;tdp;local language;ycp;leader;party;gajuwakaవిశాఖ మేయర్ టీడీపీ దేనట..చంద్రబాబులో ఎందుకీ కాన్ఫిడెన్స్..?విశాఖ మేయర్ టీడీపీ దేనట..చంద్రబాబులో ఎందుకీ కాన్ఫిడెన్స్..?chandrababu;cbn;ntr;srinivas;jagan;congress;vishakapatnam;capital;mla;lawyer;february;tdp;local language;ycp;leader;party;gajuwakaTue, 08 Dec 2020 14:00:00 GMTస్థానిక ఎన్నికల సమరం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది.. ప్రభుత్వం వద్దని చెపుతూనే ఎక్కడ ఎన్నికలు ముంచుకొస్తాయో అని అన్ని ఏర్పాట్లు చేస్తుంది.. స్థానిక లీడర్ లను ఎంపిక చేయడంతో పాటు అక్కడ గెలిచే విధి విధానాలను ఏర్పాటు చేసుకుంటుంది.. అన్ని పార్టీ లు స్థానికంగా అధికారం తెచ్చుకోవాలని సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ విశాఖ మేయర్ ఎన్నికలకు అన్ని సమకూరుస్తుంది. విశాఖ లో మేయర్ పదవి చంద్రబాబు అందని ద్రాక్షగా మిగిలిపోయింది.  ఎపుడో మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రముఖ న్యాయవాది డీవీ సుబ్బారావుని బరిలోకి దింపి ప్రత్యక్ష ఎన్నికల విధానంలో విశాఖ మేయర్ ని గెలుచుకున్నారు.

అది కూడా ఎన్టీయార్ జమానాలో. ఆ తరువాత వరసగా మూడు సార్లు ఎన్నికలు జరిగినా టీడీపీకి మేయర్ సీటు దక్కలేదు. కాంగ్రెస్ మేయర్లే విశాఖను ఏలారు. ఇపుడు కాంగ్రెస్ బలం వైసీపీకి టర్న్ అయిన వేళ కొత్త మేయర్ ఎవరా, ఏ పార్టీకి చెందిన వారు గెలుస్తారు అన్నది ఆసక్తికరమైన చర్చగానే ఉంది. అందులోనూ విశాఖ కు రాజధాని మార్చారు అన్న సనుకూలాంశం మీద జగన్ కే ఎక్కువ అక్కడ ప్రజల మద్దతు ఉంది.. విశాఖ లో రాజధాని వద్దని అన్నప్పుడే చంద్రబాబు కు విశాఖ లో నూకలు చెల్లాయని అనొచ్చు..

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ మేయర్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ని సూచించారు. ఈయన యాదవ వర్గానికి చెందిన వాడు కాగా గతంలో గాజువాక నుంచి ఒకసారి గెలిచి సత్తా చాటారు.  వైసీపీ తరపున కూడా  యాదవ సామాజికవర్గానికి చెందిన  వంశీక్రిష్ణ శ్రీనివాస్ మేయర్ పదవికోసం పోటీ చేస్తున్నారు. ఇక నిమ్మగడ్డ చొరవ తో ఎన్నికలు ఫిబ్రవరి లోనే జరిగేలా ఉన్నాయి.. కానీ ప్రభుత్వం నిమ్మగడ్డ ను సాగనంపాక ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని చూస్తున్నారు.. అందుకు శాసనసభలో తీర్మానం కూడా రాయించుకున్నారు..


ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

భారత్ బంద్: ఈ చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి: హరీష్ రావు...

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేటిఆర్ ఆవేదన

ఆ ఒక్కటీ అడగొద్దు, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే - అనుష్క

ఏది బెటరో మీరే చెప్పండి.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్

షాద్ నగర్‌లో రేవంత్, కేటీయార్ ధర్నా!

బుల్లిపిట్ట: డిజిటల్ ఎకానమీ ప్రేరణ అదే అన్న సుందర్ పిచాయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>