Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikab4815913-3efc-479a-b6a5-e98fbc9f2226-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikab4815913-3efc-479a-b6a5-e98fbc9f2226-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి ఎందరో అందమైన బ్యూటీలు ఎంట్రీ ఇచ్చేస్తుంటారు. మొదటి సినిమాల ద్వారా తమ లక్ ను పరీక్షించుకుంటారు. కొందరు భామలు మొదటి సినిమాకే హామ్ ఫట్ మనిపించినా మరికొందరు అందమైన భామలైతే మొదటి సినిమాతోనే అభిమానుల నుంచి మంచి పేరు సంపాదించుకుని ప్రముఖ డైరెక్టర్లతో, టాప్ హీరోల సరసన నటించే సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఇప్పుడు ఆ లీస్ట్ లోనే ఉంది ఈ సుందరి. ఇంతకి ఆమె ఎవరో తెలుసా.. ‘ఛలో’ అంటూ నాగశౌర్యతో రొమాన్స్ చేసి ‘గీత గోవిందం’ తో కుర్రకారు మనసును కొల్లగొట్టిన బ్యూటే రష్మిక మందాన. ఈ రెండు సినిrashmika;beauty;govinda;pooja hegde;priya;abinaya;geetha;govi;hanu ragavapudi;rashmika mandanna;cinema;tamil;chalo;director;hero;mahanati;hanu raghavapudiరష్మికా నువ్వు సారీ చెప్పావా.. ఇంతకి ఏంటి విషయం?రష్మికా నువ్వు సారీ చెప్పావా.. ఇంతకి ఏంటి విషయం?rashmika;beauty;govinda;pooja hegde;priya;abinaya;geetha;govi;hanu ragavapudi;rashmika mandanna;cinema;tamil;chalo;director;hero;mahanati;hanu raghavapudiTue, 08 Dec 2020 12:02:43 GMTరష్మిక మందాన. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన నటన, అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ చిన్నది.
ప్రస్తుతం ఈ బ్యూటీ టాప్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. కాగా ప్రస్తుతం రష్మిక వరుస సినిమాల షెడ్యూల్ తో బిజీ బిజీగా ఉంది. టైం దొరికనప్పుడల్లా ఇన్ స్టాగ్రామ్ లో మత్తెక్కించే ఫోటోలను షేర్ చేసే కుర్రకారు మతులు పోగడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా ఒక మాటతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకి ఈ బ్యూటీ ఏం మాట అన్నది అనేగా మీ సందేహం.. అయితే మీరు ఖచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే. ఒక డైరెక్టర్ ఒక సినిమా అనుకున్నారంటే ఆ సినిమా తెరకెక్కేవరకు అందులో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అంటే సమయాన్ని బట్టి, లేదా సీన్స్ ను బట్టి క్యారెక్టర్లు కూడా మారుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఆ సినిమాలో నటించే క్యారెక్టర్లు మారొచ్చు లేదా హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఇలా ఎవరైనా మారిపోయే చాన్సెస్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే రష్మిక విషయంలో కూడా జరిగిందట.
ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిన రష్మికసినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ నిపుణుల సమాచారం మేరకు మహానటి సినిమా నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక్ దత్ లు హను రాఘవపూడి దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా తీసేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. మలయాళ టాప్  హీరో దుల్కర్ హీరోగా తమిళ, తెలుగు,  మలయాళ భాషల్లో ఒక సినిమా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఇద్దరు కథానాయికలను అనుకున్నారు. అందులో ఒకరు పూజా హెగ్డే, రష్మిక మందాన్నలను ఓకే చేశారట. కాని రష్మిక ప్రస్తుతం అనేక సినిమాల్లో నటించడం మూలంగా బిజీ షెడ్యూల్ తో ఉన్నందున ఆ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకే ఈ బ్యూటీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాను సారీ అని నిర్మాతలకు చెప్పేసిందట. ఆమె తప్పుకోవడంతో రష్మిక ప్లేస్ లో రాశీఖన్నాను పెట్టాలని చూస్తున్నారట ఆ చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ విషయాలపై ఎలాంటి సమాచారం ఆ చిత్ర యూనిట్ అందించనుందోనని.


భారత్ బంద్ లో దూకుడుగా తెరాస ఎమ్మెల్యేలు

ఆచార్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కేక.. రామ్ చరణ్ పాత్ర ఇదే!

ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

హైదరాబాద్ లో ఉదృతంగా భారత్ బంద్

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>