SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohlis-tweet-creates-record-in-202039af6945-f341-4f2a-a523-f053261dadaa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohlis-tweet-creates-record-in-202039af6945-f341-4f2a-a523-f053261dadaa-415x250-IndiaHerald.jpg2020లో అత్య‌ధికంగా లైక్స్ సాధించిన ట్వీట్‌గా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ట్వీట్ రికార్డు సాధించింది. ఈ ఏడాది ఆగ‌స్ట్ 27న విరాట్ కోహ్లీ తను తండ్రి కాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఈ ట్వీట్‌కు 64 లక్షలకు పైగా లైక్స్ వ‌చ్చాయి.kohli;amitabh bachchan;anoushka;vijay;virat kohli;cricket;india;bollywood;cinema;marriage;2020;twitter;february;hero;joseph vijay;father;lie;dalapathi;master2020లో ఊపుఊపిన కోహ్లీ ట్వీట్ ఇదే..!2020లో ఊపుఊపిన కోహ్లీ ట్వీట్ ఇదే..!kohli;amitabh bachchan;anoushka;vijay;virat kohli;cricket;india;bollywood;cinema;marriage;2020;twitter;february;hero;joseph vijay;father;lie;dalapathi;masterTue, 08 Dec 2020 19:13:35 GMT2020 ఏడాది ముగిసింది. ఈ ఏడాదిలో ఎక్కువ నెలలు కరోనా భయంతోనే గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు మునుపటిలా సాధారణ జీవితానికి దగ్గరవుతున్నారు. అయితే కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలకు మాత్రం వారి కుటుంబాలతో గడిపేందుకు మంచి సమయం దొరికిందనే చెప్పవచ్చు. అయితే 2020 దగ్గరపడుతుండడంతో ఈ ఏడాది జరిగిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఇక ట్విట్టర్ ఇండియా కూడా ఈ ఏడాది అత్య‌ధికంగా లైక్స్ సాధించిన ట్వీట్‌, అత్య‌ధికంగా రీట్వీట్ చేసిన ట్వీట్, అత్య‌ధికంగా కోట్ చేసిన ట్వీట్‌ లను ప్రకటించింది. ఇందులో 2020లో అత్య‌ధికంగా లైక్స్ సాధించిన ట్వీట్‌గా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ట్వీట్ రికార్డు సాధించింది. ఈ ఏడాది ఆగ‌స్ట్ 27న విరాట్ కోహ్లీ తను తండ్రి కాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఇప్పుడు మేము ముగ్గుర‌మ‌య్యామని, జ‌న‌వ‌రి 2021లో త‌మ తొలి సంతానం రాబోతోంద‌ని కోహ్లి ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు ఈ ఏడాదిలో అత్య‌ధిక లైక్స్ వ‌చ్చిన‌ట్లు ట్విట‌ర్ ఇండియా వెల్ల‌డించింది. కాగా ఈ ట్వీట్ కు 64 లక్షలకు పైగా లైక్స్ వ‌చ్చాయి. 2017 డిసెంబ‌ర్‌ 11న విరాట్ కోహ్లి  బాలీవుడ్ సెల‌బ్రిటీ అనుష్క శర్మను ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

అలానే  అత్య‌ధికంగా రీట్వీట్ చేసిన ట్వీట్ గా సినీ హీరో దళపతి విజయ్ చేసిన ట్వీట్ రికార్డు సాధించింది. మాస్టర్ మూవీ షూటింగ్ సందర్భంగా విజయ్ వేలాది మంది  అభిమానులతో కలిసి తీసుకొన్న సెల్పీని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న విజయ్ ఈ ట్వీట్ చేయగా...  దీనికి ఒక లక్ష 45 వేలకు పైగా రీట్వీట్ లు వచ్చాయి. ఇక మోస్ట్ కోటెడ్ ట్వీట్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ రికార్డు సాధించింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని జూలై 11న అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేసాడు.  ఈ ట్వీట్ 2020లో మోస్ట్ కోటెడ్ ట్వీట్ గా నిలిచిందని ట్విట‌ర్ ఇండియా వెల్ల‌డించింది.


300 కోట్ల కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన నటుడు కళ్యాణ్!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>