CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/egg-65bf31a8a1-9602-43ae-9a45-9820c8f6743c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/egg-65bf31a8a1-9602-43ae-9a45-9820c8f6743c-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటం వలన చాలా పుష్టిగా ఉంటారు. ఎగ్ తో మనం చాలా రకాలుగా వంటకాలు చేసుకోవచ్చు. ఇక చికెన్ 65 లాగే ఎగ్ 65 కూడా చేసుకోని ఆ రుచిని ఆస్వాదించవచ్చు. మరి ఆ రుచికరమైన ఎగ్ 65 వంటకాన్ని ఎలా చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి... ఎగ్ 65కి కావాల్సినపదార్ధాలు...... గుడ్లు...6, అల్లం... 2ముక్కలు, వెల్లుల్లి... 6 - 10 రెబ్బలు, పచ్చిమిర్చి...6, కొత్తిమీర... కప్పు, కరివేపాకు...కప్పegg-65;chicken 65;india;egg;chicken;protiens;chilli;oil;garlic;cumin;letter;red chilly powder;coriander.;protein;masalaరుచికరమైన ఎగ్ 65 వంటకం ఎలా చెయ్యాలో తెలుసుకోండి...రుచికరమైన ఎగ్ 65 వంటకం ఎలా చెయ్యాలో తెలుసుకోండి...egg-65;chicken 65;india;egg;chicken;protiens;chilli;oil;garlic;cumin;letter;red chilly powder;coriander.;protein;masalaTue, 08 Dec 2020 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటం వలన చాలా పుష్టిగా ఉంటారు. ఎగ్ తో మనం చాలా రకాలుగా వంటకాలు చేసుకోవచ్చు. ఇక చికెన్ 65 లాగే ఎగ్ 65 కూడా చేసుకోని ఆ రుచిని ఆస్వాదించవచ్చు. మరి ఆ రుచికరమైన ఎగ్ 65 వంటకాన్ని ఎలా చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి...

ఎగ్ 65కి  కావాల్సినపదార్ధాలు......

గుడ్లు...6,
అల్లం... 2ముక్కలు,
వెల్లుల్లి... 6 - 10 రెబ్బలు,
పచ్చిమిర్చి...6,
కొత్తిమీర... కప్పు,
కరివేపాకు...కప్పు,
గరం మసాలా....4 టీ స్పూన్లు (తక్కువ కూడా వేసుకోవచ్చు),
కారం పొడి.... సరిపడినంత,
కశ్మీరీ కారంపొడి (రంగు కోసం)...2 టీ స్పూన్లు,
ఉప్పు....సరిపడా,
పెరుగు.... 2 కప్పులు,
చిల్లీ సాస్.... కొద్దిగా,
జీలకర్ర పొడి...2 లేదా 3 టీ స్పూన్లు,
చక్కెర... 2 టీ స్పూన్లు,
కార్న్ఫ్లోర్...1 లేదా 2 కప్పులు.

ఎగ్65 తయారుచేయు విధానం...

మొదటగా గుడ్లు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత గుడ్డులో నుంచి పచ్చసొన వేరుచేసి, తెల్లగుడ్డు మాత్రమే తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలకు... సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కారం, గరంమసాలాతోపాటు కొద్ది పరిమాణంలో బ్రెడ్ పౌడర్, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి.రెండు పగుల గొట్టిన గుడ్ల నుంచి తీసిన తెల్లసొన (ఎగ్ వైట్)ను ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించుకుని బాణలిలో నూనె వేసుకోవాలి.

నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉండలను నెమ్మదిగా స్పూన్ లేదా చేతితో నూనెలో వేసుకోవాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అన్ని ముక్కలు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.మరో ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి... వేడెక్కగానే అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పచ్చి మిర్చిని రెండుగా చీల్చినవే వేసుకోవాలి.కాసేపే వేగాక... ఇందులో కప్పు లేదా సరిపడా పెరుగు వేసుకోవాలి. కాస్తా ఉడకగానే... ఇందులో కాస్తా కశ్మీరీ కారం పొడి, గరం మసాలా, జీలకర్ర పొడితోపాటు కొద్దిగా చిల్లీ సాస్ వేసుకోవాలి. 

కొద్దిగా చక్కెర వేస్తే రుచికి బాగుంటుంది. తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.ఇక చివరగా... ముందుగా ఫ్రైచేసి పెట్టుకున్న ఉండలను వేయాలి. మంట కాస్తా పెంచి... ముక్కలకు గ్రేవీ బాగా పట్టేవరకు ప్యాన్‌ను అటు ఇటూ కదపడం చేయాలి. బాగా ఉడికింది అనుకుంటే... వెంటనే స్టౌ ఆర్పేయాలి. ఇక అంతే... రుచికరమైన ఎగ్ 65 రెడీ ఐపియినట్లే... ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు గురించి తెలుసుకోండి...


భారత్ బంద్ లో దూకుడుగా తెరాస ఎమ్మెల్యేలు

ఆచార్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కేక.. రామ్ చరణ్ పాత్ర ఇదే!

ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

హైదరాబాద్ లో ఉదృతంగా భారత్ బంద్

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>