PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modif6089ec0-18ce-4580-badd-42bd7c81b275-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modif6089ec0-18ce-4580-badd-42bd7c81b275-415x250-IndiaHerald.jpgప్రజాస్వామ్యంలో ప్రజలను కాదని ఎవరూ ముందుకు వెళ్ళలేదు. జనం మెచ్చి అయిదేళ్ళ కోసం అధికారాన్ని అప్పగిస్తారు. మళ్లీ నచ్చుకుంటేనే పవర్ చేతికి చిక్కేది. ఈ లోగా తమ చేతిలో మంత్రదండం ఉందని ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైనా తీసుకుంటే అది వారికే చివరికి ఇబ్బందే. అయితే తెలివైన వారు జనంలో వ్యతిరేకత వస్తే గుర్తించి సవరించుకుంటారు. ఎందుకుంటే మళ్ళీ ఓట్ల కోసం వారి దగ్గరకే వెళ్లాలి కాబట్టి. modi;modi;hari;hari music;india;prime minister;successరైతుల బంద్ సూపర్ సక్సెస్... మోడీ తగ్గాల్సిందే ?రైతుల బంద్ సూపర్ సక్సెస్... మోడీ తగ్గాల్సిందే ?modi;modi;hari;hari music;india;prime minister;successTue, 08 Dec 2020 20:00:00 GMT
ఇపుడు మోడీ సర్కార్ కి దాదాపు ఆరున్నరేళ్ల పాలన తరువాత తొలిసారి అతి పెద్ద వ్యతిరేకత ఎదురవుతోంది. అది కూడా దేశానికి అన్నం పెట్టే రైతుల విషయంలో. మామూలుగా ఏ రంగంలో వారు ఆందోళన చేసినా సమాజం మొత్తం రియాక్ట్ అయ్యేది చాలా తక్కువ. కానీ అన్నం పెట్టే రైతు ఆందోళన‌తో రోడ్డు మీదకు వస్తే మాత్రం అన్నం తినే ప్రతీ మనిషీ మద్దతూ కచ్చితంగా ఉంటుంది. అది అత్యంత‌ సహజం. మొదట్లో మూడు వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చిన చాలా పార్టీలు కూడా ఇపుడు రైతుల ఆందోళన విశ్వరూపం చూసి వెనక్కి తగ్గుతున్నాయి.

మద్దతు కూడా ప్రకటిస్తున్నాయి. మరి భారత్ బంద్ పేరిట రైతులు ఇచ్చిన అతి పెద్ద ఆందోళన ఈ దేశంలో విజయవంతం అయింది. ఈ మధ్యలో చాలా బందులు జరిగాయి కానీ వేటికీ ఇంత స్పందన రాలేదు. కానీ రైతులు వీధుల్లోకి వచ్చి మద్దతు కావాలని అడగ‌గానే దేశం మొత్తం సానుకూలంగా స్పందించింది. అలా ఈ మధ్య కాలంలో జరిగిన ఆందోళనల్లో దీనిని అతి పెద్ద విజయంగా చెప్పుకోవాలి. రైతులు మూడు వ్యవసాయ బిల్లులను పూర్తిగా ఉప సంహరించుకోమంటున్నారు.

ఆ విషయంలో రెండవ మాటకు తావు లేదని కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. మరి బిల్లుల్లో సవరణలు తెస్తామని మోడీ సర్కార్ అంటోంది. కానీ అది కుదరదు అని రైతులు చెప్పాక వారికి భారత్ మొత్తం మద్దతుగా నిలిచాక మోడీ సర్కార్ వెనక్కు తగ్గడమే మంచిదని అంతటా వినిపిస్తున్న మాట. మరి మోడీ ప్రధాని అయ్యాక ఇదే అతి పెద్ద వ్యతిరేకతను చవి చూస్తున్నారు. ఇక్కడ‌ మోడీ కనుక రాజనీతితో ఆలోచిస్తే భారత్ బంద్ కి తగిన పరిష్కారం దొరికినట్లే.
 




300 కోట్ల కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన నటుడు కళ్యాణ్!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>