SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/nedhu-noori5a74c666-b154-49a9-96be-3f640c6d011d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/nedhu-noori5a74c666-b154-49a9-96be-3f640c6d011d-415x250-IndiaHerald.jpgనేదునూరి కృష్ణమూర్తి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి బిరుదు పొందారు.నేదునూరి కృష్ణమూర్తి స్వర పరచిన కీర్తనలలో - దాశరథి శతకం పద్యాలు, రాగ సుధా రసాలతో భద్రాచల రామదాస కీర్తనలు ప్రసిధ్ధమైనవి. రెండు సీడీలు వెలువరించారు. అన్నమాచార్య సంకీర్తనలు, పదకదంబం మీద పలు సీ డీలు, కెసెట్లు విలువడించారు. ఆల్‌ ఇండియా రేడియో భక్తి రంజనిలో కూర్చిన నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు బాగా ప్రాచుర్యం పొంద‌డం గ‌మ‌నార్హం. కళాప్రపూర్ణ చిట్టి అబ్బాయి, శ్రీమతి కోక సత్యవతి, శ్రీమతి కె. సరస్వతి వుధ్యార్తి, జnedhu noori;balakrishna;nagarjuna akkineni;geetha;raaga;raja;ravi anchor;thirtha;tiru;vijayalakshmi;visakhapatnam;india;godavari river;vijayawada;karnataka - bengaluru;sangeetha;vishakapatnam;tirupati;k e krishnamurthy;village;music;husband;secunderabad;father;kothapalliసంగీత క‌ళానిధి నేదునూరి.. నేడు వ‌ర్ధంతిసంగీత క‌ళానిధి నేదునూరి.. నేడు వ‌ర్ధంతిnedhu noori;balakrishna;nagarjuna akkineni;geetha;raaga;raja;ravi anchor;thirtha;tiru;vijayalakshmi;visakhapatnam;india;godavari river;vijayawada;karnataka - bengaluru;sangeetha;vishakapatnam;tirupati;k e krishnamurthy;village;music;husband;secunderabad;father;kothapalliTue, 08 Dec 2020 07:25:50 GMTకృష్ణమూర్తి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి బిరుదు పొందారు.నేదునూరి కృష్ణమూర్తి స్వర పరచిన కీర్తనలలో - దాశరథి శతకం పద్యాలు, రాగ సుధా రసాలతో భద్రాచల రామదాస కీర్తనలు ప్రసిధ్ధమైనవి. రెండు సీడీలు వెలువరించారు. అన్నమాచార్య సంకీర్తనలు, పదకదంబం మీద పలు సీ డీలు, కెసెట్లు విలువడించారు. ఆల్‌ ఇండియా రేడియో భక్తి రంజనిలో కూర్చిన నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు బాగా ప్రాచుర్యం పొంద‌డం గ‌మ‌నార్హం. కళాప్రపూర్ణ చిట్టి అబ్బాయి, శ్రీమతి కోక సత్యవతి, శ్రీమతి కె. సరస్వతి వుధ్యార్తి, జి. బాలకృష్ణ ప్రసాద్‌, శ్రీమతి శోభారాజు, మల్లాది సోదరులు (శివరామ ప్రసాద్‌, రవి కుమార్‌) కూడా నేదునూరి  శిష్యులే కావడం గ‌మ‌నార్హం.


నేదునూరి విజయవాడ జీ వీ ఆర్‌ ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల, ప్రధాన అధ్యాపకుడిగా, సికింద్రాబాద్‌, విజయనగరం, తిరుపతి సంగీత కళాశాలలో పనిచేసారు. వేంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో ఆర్ట్స్ విభాగం డీన్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా, ఆల్‌ ఇండియా రేడియో, సంగీత విభాగ ఆడిషన్‌ బోర్డ్‌ సభ్యుడిగా పనిచేసారు. 1985లో ప్రభుత్వ కొలువు నుంచి రిటైర్‌ అయ్యి పింఛను తీసుకుంటున్నారు. కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ అచార్యుడిగా ఉన్నారు.నేదునూరి కృష్ణమూర్తి అక్టోబరు 10, 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నవారు. వీరి తండ్రి పిఠాపురం రాజా వారి సంస్థాన కార్యాలయంలో పనిచేస్తూండేవారు.



నేదునూరి 1940 లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్‌, గాత్రంలో ప్రాథమిక శిక్షణ పొందారు. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు నాయుడు శిష్యుడిగా ఉన్నారు. 1945 నుంచి సంగీత సభలలో పాల్గొంటూ వచ్చారు. 1949లో ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి పద్మభూషణ్‌ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి గారి వద్ద చేసి సంగీతంలో గమకాలు, ఇతర మెళకువలలో శిక్షణ పొంది, సంగీత నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. ఆల్‌ ఇండియా రేడియోలో అగ్రగణ్య కళాకారుడిగా వెలుగులోకి వచ్చారు. 1951 నుండి ఐదు దశాబ్దాలకు పైగా మద్రాసు సంగీత అకాడమీలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు.అనారోగ్యంతో బాధపడుతూ 87 సంవత్సరాల నేదునూరి విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు.






విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>