PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-party639d9f85-05e7-4300-a07a-1bf6acb8140b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-party639d9f85-05e7-4300-a07a-1bf6acb8140b-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో వరుసగా ఎదురవుతున్న పరాభవాల నేపథ్యంలో టీఆర్ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అప్రమత్తమయ్యారు. కేంద్రంలో బీజేపీ విసురుతున్న రాజకీయ సవాళ్లు, తమ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి బయటపడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో తమ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి, రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడే రాజకీయ వ్యూహరచన ప్రారంభించారు. ఈ మేరకు చాలాకాలం క్రితం తెలంగాణలో కార్యకలాపాలను నిలిపివేసిన వైసీపీ పునరుజ్జీవానికి పావులు కదుపుతున్ycp party;view;nagarjuna akkineni;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;jagan;andhra pradesh;telangana;congress;government;nalgonda;chief minister;loksabha;car;assembly;air;ranga reddy;central government;ycp;reddy;dookudu;partyతెలంగాణ లో మళ్ళీ జగన్ పార్టీతెలంగాణ లో మళ్ళీ జగన్ పార్టీycp party;view;nagarjuna akkineni;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;jagan;andhra pradesh;telangana;congress;government;nalgonda;chief minister;loksabha;car;assembly;air;ranga reddy;central government;ycp;reddy;dookudu;partyTue, 08 Dec 2020 08:34:14 GMT


తెలంగాణ లో మళ్ళీ జగన్ పార్టీ


రాష్ట్రంలో వరుసగా ఎదురవుతున్న పరాభవాల నేపథ్యంలో టీఆర్ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అప్రమత్తమయ్యారు. కేంద్రంలో బీజేపీ విసురుతున్న రాజకీయ సవాళ్లు, తమ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి బయటపడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో తమ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి, రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడే రాజకీయ వ్యూహరచన ప్రారంభించారు.

ఈ మేరకు చాలాకాలం క్రితం తెలంగాణలో కార్యకలాపాలను నిలిపివేసిన వైసీపీ పునరుజ్జీవానికి పావులు కదుపుతున్నారు. బీజేపీని నిలువరించటం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తేవటం లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ సోమవారం ఏపీలోని అధికార వైసీపీ ముఖ్యులతో మంతనాలు సాగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తక్షణం తెలంగాణలో వైసీపీ పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని కూడా ఆయన వారికి సూచించారు.




తెలంగాణలో తొలిసారి తమ పార్టీ టీఆర్ఎస్ కు

ఎదురుగాలి వీస్తుండటంతో సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ నుంచి తాజాగా రాజకీయ సాయం కోరినట్లు తెలుస్తోంది. 2014 నుంచి ఇక్కడ తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న టీఆర్ఎస్‌ కారుకు, ఈమధ్య దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం అనూహ్యంగా బ్రేకులు వేసింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ దూకుడుతో పాటు, టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేలిపోయింది. అయితే గ్రేటర్‌ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు టీఆర్ఎస్

అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా పని చేశాయి.


కమలం ఓట్లకు జగన్‌ పార్టీ గండి కొట్టింది. సెటిలర్ల ఓట్లు గంప గుత్తగా టీఆర్ఎస్ కు

పడేలా చేయటంలో సఫలీకృతమైంది. ఈ రకంగా బీజేపీ ఓట్లకు వైసీపీ తూట్లు పెట్టకపోతే, జీహెచ్ఎంసీలో కమలం అతి పెద్ద పార్టీగా అవతరించేదనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ రకమైన పరోక్ష పద్దతి ద్వారా తాము ఇక ముందు జరిగే ఎన్నికల్లోనూ రాజకీయ ప్రయోజనం పొందటం అంత సులువు కాదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ ఇక్కడ వైసీపీ కార్యకలాపాలు పెంచాలని ఆ పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ చేతిలో రెండు వరుస దెబ్బలు తిన్న టీఆర్ఎస్‌ కొద్ది నెలల్లో ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది.


దాంతోపాటు వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్‌-రంగారెడ్డి-మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలబడాల్సి ఉంటుంది. వీటికన్నా ముఖ్యంగా నాగార్జున సాగర్‌ సిట్టింగ్‌ శాసనసభా స్థానానికి జరిగే ఉప ఎన్నికలో గెలిచి, ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలి. వరంగల్‌ కార్పొరేషన్‌ వదిలేస్తే మిగతావన్నీ వైసీపీకి పునాది ఉన్న ఖమ్మం జిల్లాలో కానీ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో కానీ విస్తరించి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పరోక్ష సహకారం తప్పనిసరి అని గులాబీ బాస్‌ భావిస్తున్నారు.


తెలంగాణలో వైసీపీ క్రియాశీలం అయితే, బీజేపీ నాయకత్వం ఆకట్టుకుంటున్న రెడ్డి సామాజిక వర్గంలో చీలిక వస్తుంది. రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం టీఆర్ఎస్ ను 

వ్యతిరేకించే పక్షంలో ఆ వర్గం ఓట్లు ఏకపక్షంగా తమకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీకి పడవు. ఆ ఓట్లు బీజేపీ, వైసీపీ మధ్య చీలిపోతాయి. అలాగే టీఆర్ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇక్కడ బలంగా లేని కాంగ్రెస్ కు

పడే అవకాశం లేదు. అవి మొత్తానికి మొత్తంగా బీజేపీకి మళ్లే పక్షంలో కమలం హోరులో కారు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.

దీనికి అడ్డుకట్ట పడాలంటే, రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో కొంత అభిమానం ఉన్న వైసీపీని ఇక్కడ నిలబడేలా చేయాలి. తెలంగాణలో బీజేపీ మినహా తమకు పోటీనిచ్చే మూడో పార్టీ అంటూ ఏదీ లేకపోవటం టీఆర్ఎస్ కు

నష్టం చేస్తుంది. వైసీపీ ఆ రూపంలో ఇక్కడ ఉంటేనే, కారుకు శ్రేయస్కరం అనేది సీఎం కేసీఆర్‌ ఆలోచనగా తెలుస్తోంది.





విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>