PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan53622f7d-0eb9-4393-b604-547a603a47b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan53622f7d-0eb9-4393-b604-547a603a47b5-415x250-IndiaHerald.jpgనివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులకు తక్షణ సాయం, పరిహారం ఇవ్వడంలో ఏపీ సర్కార్ నిర్లక్ష్యం కనబరుస్తోందని మండిపడ్డారు. ఏలూరులో అంతుబట్టని అనారోగ్య సమస్యలపై కేంద్ర బృందం విచారణ అవసరమని అన్నారు. pawan kalyan;pawan;amala akkineni;kalyan;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;government;prime minister;chief minister;letter;central government;janasena party;eluruఏలూరు ఘటనపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్న పవన్ఏలూరు ఘటనపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్న పవన్pawan kalyan;pawan;amala akkineni;kalyan;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;government;prime minister;chief minister;letter;central government;janasena party;eluruTue, 08 Dec 2020 21:33:43 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ రైతుల కోసం చేపట్టిన పర్యటన సహా పలు అంశాలపై ఇరు పార్టీల నేతలు చర్చించారు.  ఏపీలో వరుసగా చోటు చేసుకున్న విపత్తుల కారణంగా రైతాంగం అన్ని విధాలుగా నష్టపోయారని, అయినప్పటికీ వారికి తక్షణ సాయం, పరిహారం ఇవ్వడంలో ఏపీ సర్కార్  నిర్లక్ష్యం కనబరుస్తోందని  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు తక్షణమే  పరిహారం చెల్లించాలని  డిమాండ్ చేసారు. రైతుల్లో ఏర్పడుతున్న నిరాశ నిస్పృహలను దూరం చేయాల్సిన కర్తవ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని...అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అసమర్ధ విధానాలు, పాలన వైఫల్యాలతో రహదారుల నిర్వహణ, నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.  రాష్ట్రంలో ధ్వంసమైన రహదారులే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏలూరు ఘటనపై కూడా ఈ సమావేశంలో చర్చకు  వచ్చింది. ఏలూరు నగరంలో అంతుపట్టని అనారోగ్య సమస్యలతో ప్రజలు పడుతున్న ఆందోళనపై ఇరు పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రత దృష్ట్యా ఏలూరుకు ప్రత్యేక కేంద్ర బృందాలను పంపించి పరిస్థితిని అధ్యయనం చేయించి విచారణ జరిపించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి.

రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనరల్ కేటగిరీకి చెందిన ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు పరచడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఎంతో మంది పేద యువతీయువకులు అవకాశాలు కోల్పోతున్నారని బీజేపీ, జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు. కేంద్రం ఎంతో విశాల దృక్పథంతో తీసుకువచ్చిన ఈ రాజ్యాంగ సవరణ అమలు పరిచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు నిర్ణయించారు.




మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!

యాంకర్ ఝాన్సీ జీవితంలో అతి పెద్ద షాక్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>