MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagashourya1fbee716-8422-4f23-bb8b-948418644a39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagashourya1fbee716-8422-4f23-bb8b-948418644a39-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో మేపిస్తున్న హీరో నాగశౌర్య. యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ప్ర‌స్తుతం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ ల‌క్ష్య‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇక విలువిద్య‌కు సంబంధించిన ప్ర‌త్యేక‌మైన త‌ర‌గ‌తులకు కూడా వెళ్లాడట నాగ‌శౌర్య‌. nagashourya;annish krishna;krishna;santhosh;sharath;vidya;cinema;telugu;chalo;hero;success;yuva;ala ela;anish krishna;santhossh jagarlapudi;nagashaurya;sharrath marar1;massవిలువిద్య నేర్చుకోవడానికి నాగశౌర్య పాట్లు..!విలువిద్య నేర్చుకోవడానికి నాగశౌర్య పాట్లు..!nagashourya;annish krishna;krishna;santhosh;sharath;vidya;cinema;telugu;chalo;hero;success;yuva;ala ela;anish krishna;santhossh jagarlapudi;nagashaurya;sharrath marar1;massTue, 08 Dec 2020 11:00:00 GMTహీరో నాగశౌర్య. యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ప్ర‌స్తుతం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ ల‌క్ష్య‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇక విలువిద్య‌కు సంబంధించిన ప్ర‌త్యేక‌మైన త‌ర‌గ‌తులకు కూడా వెళ్లాడట నాగ‌శౌర్య‌. ఆర్చ‌రీలో సీనియ‌ర్ ప్లేయ‌ర్స్‌ను క‌లుసుకుని దానికి సంబంధించిన స్పెష‌ల్ వ‌ర్క్ అంతా కూడా చేశాడ‌ట‌. ఇంత క‌ష్ట‌ప‌డ‌టానికి కార‌ణం సినిమాలో క‌నిపించేట‌ప్పుడు చాలా నేచుర‌ల్‌గా క‌నిపించాల‌నే తాప‌త్రయం. ఇదే శౌర్య క‌మిట్‌మెంట్ అని చిత్ర యూనిట్ చెబుతుంది.

ఇక నాగ‌శౌర్య ఈ సినిమాతో పాటు నాగ‌శౌర్య వ‌రుడు కావాలి సినిమాలోనూ న‌టిస్తున్నాడు. త‌న సొంత బ్యాన‌ర్‌లోనూ ఓ సినిమాను నిర్మిస్తూ న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకుడు. ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాగ‌శౌర్య .. ఆ సినిమాతో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. క్ర‌మంగా హీరోగా బిజీ అవుతూ వ‌చ్చాడు.

అదే స‌మ‌యంలో త‌నే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి నిర్మాత‌గా మారాడు. హీరోగా.. నిర్మాత‌గా నాగ‌శౌర్య చేసిన తొలి చిత్రం ఛలో. ఈ సినిమాతో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా తెలుగులో ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమా చాలా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అయితే నిర్మాతగా త‌ర్వాత నాగ‌శౌర్య రెండు సినిమాలు చేశాడు. అందులో ఓ సినిమా న‌ర్త‌న‌శాల‌. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

అయితే కాస్త గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ నాగ‌శౌర్య నిర్మిస్తూ న‌టించిన సినిమా అశ్వథ్థామ‌. ఈ సినిమాకు త‌నే క‌థ‌ను కూడా అందించాడు.ఈ సినిమా కోసం తొలిసారి నాగ‌శౌర్య ఫిజిక‌ల్ లుక్ మార్చాడు. మాస్ లుక్ కోసం బాడీ పెంచాడు. అయితే ఎన్ని చేసినా సినిమా మాత్రం స‌క్సెస్ కాలేదు. డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు నాలుగో సినిమాను నిర్మిస్తున్నాడు. ఇత‌ర నిర్మాణ సంస్థ‌ల్లోనూ సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఇప్పుడు నాగశౌర్యకి నిర్మాతగా సక్సెస్ కావాలి.. హీరోగానూ సక్సెస్ కావాలి. మరి రాబోయే చిత్రాలతో హిట్స్ కొట్టి నాగశౌర్య సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలి మరి.


లీటర్ పెట్రోల్ ధర 40 రూ.లు.. బిజెపి ఎంపీ కీలక వ్యాఖ్యలు..?

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>