PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharath-bundh64c6aedd-9a07-48c4-895b-b2fdc13d1939-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharath-bundh64c6aedd-9a07-48c4-895b-b2fdc13d1939-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ కూడా రైతులకు మద్దతుగా బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులు తేనె పూసిన కత్తి లాంటివని, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని..వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ధ్వజమెత్తారు.bharath-bundh;hari;hari music;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;rtc;police;bus;minister;letter;central government;cpi;party;katthiభారత్ బంద్: ఈ చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి: హరీష్ రావు...భారత్ బంద్: ఈ చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి: హరీష్ రావు...bharath-bundh;hari;hari music;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;rtc;police;bus;minister;letter;central government;cpi;party;katthiTue, 08 Dec 2020 14:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా వీరికి మద్దతు పలుకుతూ బీజేపీ మినహా మిగిలిన పలు పార్టీల నాయకులు మద్దతు పలుకుతున్నాయి. మరి కొందరు సినీ ప్రముఖులు సైతం రైతుల కోసం గళం ఎత్తుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవసాయ సంక్షేమం కొరకు రైతు సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఆ చట్టాలను రద్దు చేయాలంటూ.... కేంద్రం రైతుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలంటూ... రైతులను నష్టపరిచే  బిల్లులను వెనక్కి తీసుకోవాలంటూ... నేడు దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు బంద్‌ పాటిస్తున్నాయి.

మంగళవారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్‌ ప్రారంభించారు. అత్యవసర సేవలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా బంద్ కొనసాగించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దాంతో పలు రాష్ట్రాలలో మొదలయిన బందు ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ  బస్సులు, రైళ్లు నిలిచిపోయాయి. రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది.... విద్యాసంస్థలు... వ్యాపార సంస్థలు ఇలా అన్నీ బంద్ కారణంగా తెరుచుకోలేదు. ఓ విధంగా రైతులు చేస్తున్న ఈ ఉద్యమానికి పలు రాష్ట్ర అధికారులు సైతం కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు రోడ్ ఎక్కలేదు. పలు వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థలు సైతం రైతులకు మేలు చేకూరాలని స్వచ్ఛందంగా మూసివేసి రైతుల నిరసనకు మద్దతు పలికారు. అటు పోలీసుశాఖ కూడా రైతు సంఘాలు చేస్తున్న ఈ బంద్ కు  శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా  ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకొని వారి బాధ్యతను నిర్వహిస్తున్నారు. కొన్ని పార్టీల నాయకులు రైతులకు అండగా మేమున్నామంటూ... ఈ సమస్య గట్టెక్కే వరకు ఊరుకునేది లేదంటూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. సీపీఐ, సీపీఎంతో పాటు వివిధ ప్రజా సంఘాలు ప్రారంభించిన ఈ బంద్ కు వై ఎస్ ఆర్ సి పి మద్దతు పలకడం విశేషం. అయితే  తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ కూడా రైతులకు మద్దతుగా బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులు తేనె పూసిన కత్తి లాంటివని, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని..వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ధ్వజమెత్తారు.


ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేటిఆర్ ఆవేదన

ఆ ఒక్కటీ అడగొద్దు, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే - అనుష్క

ఏది బెటరో మీరే చెప్పండి.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్

షాద్ నగర్‌లో రేవంత్, కేటీయార్ ధర్నా!

బుల్లిపిట్ట: డిజిటల్ ఎకానమీ ప్రేరణ అదే అన్న సుందర్ పిచాయ్

గడాఫీ గతే కేసీఆర్ కి... సిఎంపై ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>