WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy0f158047-23cb-4a02-9efa-8c333ae7967f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy0f158047-23cb-4a02-9efa-8c333ae7967f-415x250-IndiaHerald.jpgకొంతమంది మహిళలు గర్భం దాల్చినపుడు కొన్ని సార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్‌గానే వస్తుంది. అయితే రెండు, మూడు సార్లు టెస్ట్ చేయడం ద్వారా గర్భం వచ్చిందో లేదో కచ్చితంగా తెలుసుకోవచ్చు. పీరియడ్స్ టైంకి రాకపోవడం, రొమ్ముల్లో వాపు, నలతగా అనిపించడం వంటివి కనిపించినా కొన్నిసార్లు పరీక్షలో గర్భం నిర్ధారణ కాకపోవచ్చు.pregnancy;mandula;kanna lakshminarayanaఅమ్మ: ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉన్నా.. టెస్ట్ లో నెగటీవ్ వస్తోందా కారణాలు ఇవే..!?అమ్మ: ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉన్నా.. టెస్ట్ లో నెగటీవ్ వస్తోందా కారణాలు ఇవే..!?pregnancy;mandula;kanna lakshminarayanaTue, 08 Dec 2020 15:00:00 GMT
ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్‌ను వెంటవెంటనే, సరైన విరామం తీసుకోకుండా చేయించుకోవడం వల్ల ఫలితాలు సరిగా రాకపోవచ్చు. టెస్ట్ కిట్‌ ప్యాకేజీపై ఇచ్చిన సూచనలు పాటిస్తూ, సరైన తేదీలో పరీక్షించుకోవాలి. ఫలితం మళ్లీ నెగెటివ్‌గా వస్తే, కొన్ని రోజుల విరామం తర్వాత టెస్ట్ చేసుకోవాలి. గడువు ముగిసిన, విరిగిపోయిన టెస్టింగ్ కిట్లతో ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసుకుంటే సరైన ఫలితం రాకపోవచ్చు. వాటిని కొనేటప్పుడే ఎంతవరకు గడువు ఉందో చూసుకోవాలి. టెస్టింగ్ కిట్లను సరిగా భద్రపరచాలి. మరీ వేడిగా, మరీ చల్లగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఉంచకూడదు.

అయితే పీరియడ్స్ రాకపోవడాన్ని గర్భం వచ్చిందనడానికి సంకేతంగా భావిస్తారు. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నా నెగెటివ్ గా వచ్చిందంటే హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారని అర్థం. ఈ సమస్య ఉన్న వారిలో పీరియడ్స్ గడువు కంటే ముందుగానే రావచ్చు. లేదా కొన్నిసార్లు రాకుండా పోవచ్చు.  పీసీఓడీ సమస్య ఉన్నవారిలో నెలసరి మరిన్ని రోజులు ఆలస్యం కావచ్చు. పీరియడ్స్ రెండు నుంచి మూడు వారాల కన్నా ఎక్కువ ఆలస్యమైతే, తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

ఎక్కువగా నీరు తాగుతూ, పరీక్షించుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్‌గా చూపిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం డైల్యూట్ అవుతుంది. ఇది ఫలితం కచ్చితత్వంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే రాత్రి వేళల్లో నీరు ఎక్కువగా తాగకుండా, మరుసటి రోజు ఉదయాన్నే టెస్ట్ చేసుకోవడం మంచిది. గర్భం రాకుండా వాడే పిల్స్, ఇతర కాంట్రాసెప్టివ్ మెడిసిన్‌ వంటివి ప్రెగ్నెన్సీ ఫలితాలపై ప్రభావం చూపుతాయి. ఇవి రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తాయి. ఇవి శరీరంపై, గర్భధారణపై దుష్ప్రభావం చూపుతాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, వారి సలహాతో మందులు వాడాలి.




ఉదయపూర్ కోటలో జరగనున్న నిహారిక పెళ్లికి అయిన ఖర్చు ఎంతో తెలుసా..??

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?

జగనన్న ఆ విషయంలో నువ్వు గ్రేట్ అన్నా.. నీకు లేరు పోటీ..!!

ప్రభాస్ కి హీరోయిన్ కంటే విలన్ ముఖ్యం, ఎందుకో తెలుసా?

ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

అదిరిపోయే ఫామ్ లో ఉన్న రవీంద్ర జడేజా తొలి టెస్టుకు దూరం.. కారణం అదే..?

విశాఖ మేయర్ టీడీపీ దేనట..చంద్రబాబులో ఎందుకీ కాన్ఫిడెన్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>